బాల‌య్య‌ చేతిలో ఓడినా... జగన్ కు నచ్చాడు

బాల‌య్య‌ చేతిలో ఓడినా... జగన్ కు నచ్చాడు

రాష్ట్రమంతటా వైసీపీ ఫ్యాను గాలి బలంగా వీచినా... నంద‌మూరి బాల‌కృష్ణ ఇలాకా అయిన హిందూపురంలో మాత్రం సైకిల్‌కు ఎదురులేకపోయింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో ఈసారి టీడీపీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది. హిందూపురం నుంచి బాలయ్యతో పాటు ఉరవకొండ అభ్యర్థి పయ్యావుల కేశవ్ మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగి.. ఓటమిపాలైన వైసీపీ నేత ఇక్బాల్‌కు జ‌గ‌న్ ఊహించ‌ని వరం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత‌ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇక్బాల్‌ను ఎమ్మెల్సీ చేస్తామని ప్ర‌క‌టించారు.

పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని గుంటూరులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏపీ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తారు విందు ఏర్పాటు చేసింది. ఈ ఇఫ్తార్‌ విందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో ఐదుగురు ముస్లింలకు టికెట్లు ఇచ్చాం... నలుగురు గెలిచారు.. హిందూపురంలో మాత్రం ఇక్బాల్ ఓడిపోయారు.. ఆయనను ఎమ్మెల్సీని చేస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.త‌ద్వారా ఇక్క‌డి నుంచి గెలుపొందిన నంద‌మూరి బాల‌కృష్ణ టార్గెట్‌గా ఐదు సంవ‌త్స‌రాల ముందే...జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. కాగా, జ‌గ‌న్‌ ప్రకటించిన తొలి ఎమ్మెల్సీ ఇక్బాల్ కావ‌డం గ‌మ‌నార్హం.

బాలయ్యబాబు హిందూపురం నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించాడు. అనంతపురం జిల్లా నుంచి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఒకే ఒక్క టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి... బాలయ్య బాబుకు చెక్ పెట్టేలా వ్యూహరచన చేస్తున్నార‌ని...అందులో భాగ‌మే ఈ ఎత్తుగ‌డ అని ప‌లువురు పేర్కొంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English