టీడీపీని వెంటాడుతున్న పంచ ‘భూతాలు‘

ఏపీ ప్ర‌దాన ప్ర‌తిప‌క్షం టీడీపీ గురించి ఒక చిత్ర‌మైన టాక్ వినిపిస్తోంది. పార్టీ అధికారం కోల్పోయి.. రెండు న్నరేళ్లు అయిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర‌మైన ప‌రాజ‌యాన్నే చ‌వి చూసింది. కేవ‌లం 23 సీట్ల‌కే టీడీపీ ప‌రిమిత‌మైంది. దీంతో పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారిపోయింది. ఈ మ‌ధ్య కాలంలో పార్టీ అనేక రూపాల్లో ఉద్య‌మాలు చేసింది. అధికార పార్టీ వైసీపీపై దూకుడుగా వ్య‌వ‌హ‌రించింది. చంద్ర‌బాబు కూడా పార్టీని నిల‌బెట్టుకునేందుకుఅనేక రూపాల్లో ఆందోళ‌న చేశారు. పార్టీ కార్యాల‌యంపై దాడి జ‌రిగిన‌ప్పుడు.. ఆయ‌న స్వ‌యంగా దీక్ష‌కు కూర్చున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పైనా దండెత్తారు.

ఇక‌, చంద్ర‌బాబు త‌న కుమారుడు, పార్టీ యువ‌నేత‌ లోకేష్‌ను క్షేత్ర‌స్థాయిలోకి పంపించారు. ఎక్క‌డ ఎవ‌రు ఆప‌ద‌లో ఉన్నా.. ప‌రిశీలించి.. వారికి సాయం అందించే ప్ర‌య‌త్నాలు కూడా చేశారు. అయితే.. ఇంత జ‌రిగినా.. పార్టీలో కొత్త ఊపు క‌నిపించ‌లేద‌నేది ప్ర‌ధాన వాద‌న‌. ఎంత ప్ర‌య‌త్నం చేసినా..పార్టీలో ఊపు తీసుకురాలేక పోతున్నార‌నే వాద‌న కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో హ‌ల్చ‌ల్ చేస్తోంది. ప్ర‌ధానంగా.. వైసీపీ ప్ర‌భు త్వం తీసుకువ‌స్తున్న ప‌లు ప‌థ‌కాలతో ప్ర‌జ‌ల్లో అయోమ‌య ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ప్ర‌భుత్వంపై ఒక విధమైన వ్య‌తిరేక కూడా ఏర్ప‌డుతోంద‌నే వాద‌న కూడా ఉంది.

ఈ నేప‌థ్యంలోప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్ర‌య‌త్నం చేసి నా.. అనుకున్న విధంగా వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌.. టీడీపీకి అనుకూలంగా మార‌డం లేద‌ని.. రాజ‌కీ య నేత‌లు చెబుతున్నారు. దీనికి ప్ర‌ధానంగా ఐదు కార‌ణాలు ఉన్నాయ‌ని చెబుతున్నాయి.
1.  నేత‌ల్లో నెలకొన్న అనుమానం(ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుందా లేదా?)
2.  వైసీపీ నేత‌ల‌తో తెర‌చాటు స్నేహం
3.  అధినేత ప‌ట్ల న‌మ్మ‌కం లేక‌పోవ‌డం
4.  క్షేత్ర‌స్థాయిలో నాయ‌క‌త్వ లోపాలు
5.  ఆర్థికంగా క్షేత్ర‌స్థాయిలో స‌మ‌స్య‌లు

ఈ ఐదు కార‌ణాలే.. టీడీపీని ఇరుకున పెడుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయా విష‌యాల‌పై చంద్ర‌బాబు దృష్టి పెట్ట‌కుండా.. ఎన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినా ప్ర‌యోజ‌నం లేద‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా మ‌నం అధికారంలోకి వ‌స్తామ‌నే ధీమా క‌ల్పించ‌డంలో పార్టీ అధినాయ‌క‌త్వం విఫ‌ల‌మ‌వుతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా..ఈ ఐదు అంశాల‌పై చంద్ర‌బాబు.. దృష్టిపెట్టి స‌రిచేస్తే.. త‌ప్ప పార్టీ గాడిన ప‌డ‌డం సాధ్యం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.