అప్పుడు కొట్లాడి... ఇప్పుడు వద్దంటున్నారే

అప్పుడు కొట్లాడి... ఇప్పుడు వద్దంటున్నారే

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో రియలైజేషన్ వచ్చినట్టే కనిపిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 44 సీట్లకు పరిమితమైపోయిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా కోల్పోయింది. మొత్తం సభ్యుల సంఖ్యలో పదో వంతు సీట్లు వస్తేనే గానీ ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు. ఈ లెక్కన మొత్తం 543 సీట్లుంటే... హీనపక్షం 55 సీట్లు సాధిస్తేనే ప్రదాన ప్రతిపక్ష హోదా వస్తుందన్న మాట. అయితే ఆ మార్కుకు ఇంకా 11 సీట్ల దూరంలోనే నిలిచిపోయిన కాంగ్రెస్ పార్టీ... అధికార పక్షం ఎన్డీఏతో పోరాడి మరీ ప్రధాన ప్రతిపక్ష హోదాను సాధించుకుంది.

 అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదాకు సరిపడ 55 సీట్లను కాంగ్రెస్ పార్టీ సాధించలేకపోయింది. గడచిన ఎన్నికల్లో కంటే 8 స్థానాలను అదనంగా గెలిచినా... ప్రధాన ప్రతిపక్ష హోదాకు ఇంకా మూడు సీట్ల దూరంలో నిలిచిపోయిందన్న మాట. మరి ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్ పోరాడాల్సిందే కదా. అయితే మునుపటిలా వ్యవహరించకూడదని నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ... ఒకవేళ ఎన్డీఏ సర్కారు తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనుకున్నా... తాను మాత్రం వద్దని చెప్పాలని నిర్దేశించుకుందట.

 అయినా ఐదేళ్లలోనే ఇంత మార్పు ఎలా వచ్చిందన్నది ఇప్పుడు ఎవరికీ అంతుబట్టడం లేదు. నాడు 44 సీట్లు వచ్చినా ప్రధాన ప్రతిపక్ష హోదా కావాల్సిందేనని పార్లమెంటు సాక్షిగా పోరు సాగించి సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు ఈ హోదాను అడగకుండా ఇస్తామన్నా తీసుకోకూడదని నిర్దేశించుకుందంటే... ఏం జరిగిందా? అన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. ఎన్ని విశ్లేషణలు ఎలా ఉన్నా... తనకు ప్రజలు ఇచ్చిన సీట్ల మేరకే వ్యవహరించాలన్న రియలైజేషన్ తోనే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English