వ‌ర్మ మార్కు ర‌చ్చ‌... టీడీపీ నేత‌లపై డైరెక్ట్ అటాక్

వ‌ర్మ మార్కు ర‌చ్చ‌... టీడీపీ నేత‌లపై డైరెక్ట్ అటాక్

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ ఏది చేసినా కాస్తంత డిఫ‌రెంట్ rnగానే ఉంటుంది. సినిమా ద‌ర్శ‌కుడిగానే ప‌రిచ‌యం అయిన వ‌ర్మ‌... ఇప్పుడు తానుrn సినిమాలతోనే ఏకంగా ఓ పొలిటీషియ‌న్ అయిపోయాయ‌న్న ధీమాతో ఉన్న‌ట్టుగా rnక‌నిపిస్తోంది. సినిమాలు తీయ‌డం, వాటిని ప్ర‌మోట్ చేసుకోవ‌డంలో వ‌ర్మ‌ను rnమించిన వారు లేర‌నే చెప్పాలి. త‌న‌దైన జాన‌ర్ చిత్రాల‌ను ఎప్పుడో వ‌దిలేసినrn వ‌ర్మ‌... ఇప్పుడు కొత్త‌గా పొలిటిక‌ల్ నేప‌థ్యం ఉన్న సినిమాల‌పై దృష్టి rnసారించార‌ని చెప్పాలి. టీడీపీ దివంగ‌త నేత ప‌రిటాల ర‌వీంద్ర బ‌యోపిక్ అంటూ rnఆయ‌న తెర‌కెక్కించిన ర‌క్త చ‌రిత్ర సినిమా హిట్ కావ‌డంతో పాటుగా జ‌నానికి rnమ‌రింత చేరువ అయిన వ‌ర్మ... ఆ త‌ర్వాత వంగ‌వీటి, తాజాగా ల‌క్ష్మీస్ rnఎన్టీఆర్ చిత్రాల‌ను తీశారు.

స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర్మ rnతెరెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా వ‌ర్మ నేరుగా టీడీపీనే టార్గెట్ rnచేశారని చెప్ప‌క త‌ప్ప‌దు. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ల‌క్ష్యంగాrn చిత్రీక‌రించిన ఈ సినిమా ఇత‌ర ప్రాంతాల్లో విడుదలైనా ఏపీలో మాత్రం జ‌నం rnముందుకు రాలేక‌పోయింది. ఇంకోవైపు తాను ధ్వేషించే చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో rnఓడిపోవ‌డం,. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం కావ‌డంతో rnఇప్పుడు వ‌ర్మ త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. టీడీపీ ప‌గ్గాల‌ను ఇక rnజూనియ‌ర్ ఎన్టీఆర్ కు అప్ప‌గించాలన్న డిమాండ్ ను తెర మీద‌కు తెచ్చిన rnవ‌ర్మ‌... ఆ ట్వీట్ ఆధారంగానే టీడీపీ నేత‌ల‌పై వ‌రుస‌గా విమ‌ర్శ‌లు rnగుప్పిస్తూ వ‌స్తున్నారు. తాజాగా టీడీపీ నేత‌ల నుంచి బెదిరింపులు rnఎదుర‌వుతున్నాయ‌ని గ‌గ్గోలు పెడుతున్న వ‌ర్మ‌... నిన్న రాత్రి ట్విట్ట‌ర్ rnవేదిక‌గా సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

టీడీపీ నేత‌ల‌ను ఈగ‌లు, rnదోమ‌లుగా అభివ‌ర్ణించిన వ‌ర్మ‌... క‌నీసం కుక్క‌ల్లా అయినా మొర‌గండి అంటూ rnకామెంట్ చేసి ఈ ర‌చ్చ‌ను తారాస్థాయికి తీసుకెళ్లార‌నే చెప్పాలి. టీడీపీ rnనేత‌ల నుంచి ఎదుర‌య్యే బెదిరింపుల‌ను తాను ఎంతమాత్రం బెదిరిపోన‌ని... rnఈగ‌లు, దోమ‌ల్లా గీపెట్ట‌కుండా క‌నీసం కుక్క‌ల్లా అయినా మొర‌గండి అంటూ rnకామెంట్లు చేసిన వ‌ర్మ‌... నిజంగానే పెద్ద ర‌చ్చ‌కే తెర తీశార‌ని చెప్పాలి.rn అయినా దాక్కుని బెదిరింపుల‌కు పాల్ప‌డే టైపు తాను కాద‌ని, ధైర్యంగానే rnముందుకు వ‌చ్చి మాట్లాడే వ్య‌క్తిని అని త‌నకు తాను ఓ డిగ్రీ ఇచ్చేసుకున్న rnవ‌ర్మ‌... టీడీపీ నేత‌ల‌ను మాత్రం ఓ రేంజిలో దునుమాడేశారు. మ‌రి ఈ ర‌చ్చ rnఎంత‌దాకా వెళుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English