అదే జ‌గ‌న్ ఎంట్రీని వాయిదా వేసిందా?

అదే జ‌గ‌న్ ఎంట్రీని వాయిదా వేసిందా?

ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాతి రోజు నుంచే ఏపీ స‌చివాల‌యానికి ఆయ‌న హాజ‌ర‌వుతారంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఈ వాద‌న‌కు త‌గ్గ‌ట్లే ఏర్పాట్లు హుటాహుటిన జ‌రిగాయి. హెలిప్యాడ్ సిద్ధం చేయ‌టం.. చివ‌ర‌కు నేమ్ ప్లేట్ ను కూడా ఓకే చేసేసి.. పెట్టేశారు. ఇక‌.. జ‌గ‌న్ అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లే.. ఇంటీరియ‌ర్ కూడా మార్పులు చేశారు.

మ‌రిన్ని మార్పులు చేసిన త‌ర్వాత ఆయ‌న ఎందుక‌ని సీఎంవోకి రాలేదు. ఇంటి వ‌ద్ద నుంచే ఎందుకు ప‌ని చేశారు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. దీనికి స‌మాధానం వెతికితే ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూశాయి. ఏపీ స‌చివాల‌యానికి వాస్తు దోషాలు వెంటాడుతున్నాయ‌ని.. మ‌రి ముఖ్యంగా సీఎంవోలో వాస్తు ప‌రంగా చేయాల్సిన మార్పులు ఉన్నాయ‌ని తేల్చారు. దీంతో.. ఈ దోషాల‌కు ప‌రిహారంగా చేయాల్సిన మార్పులు ఇప్ప‌టికే మొద‌లు పెట్టేశారు.

ఆ మార్పులు పూర్తి కాక‌పోవ‌టంతో.. అవ‌న్నీ అయ్యే వ‌ర‌కూ స‌చివాల‌యంలోకి అడుగు పెట్ట‌కూడ‌ద‌ని జ‌గ‌న్ డిసైడ్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. ఆగ్నేయం నుంచి సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం ఛాంబ‌ర్ లో మార్పులు - చేర్పులు చేస్తున్నారు. పాత ఛాంబ‌ర్ ప‌క్క‌నే కొత్త ఛాంబ‌ర్ నిర్మిస్తున్నారు.

ఈ మార్పుల‌తో పాటు సీఎం ఛాంబ‌ర్ లోకి వెళ్లే ఒక ద్వారాన్ని మూసివేయాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. అదే విధంగా ప్రోటోకాల్ రూం.. సంద‌ర్శ‌కులు వెయిట్ చేసే గ‌దుల గోడ‌ల్ని తొల‌గించేశారు. ఈ మార్పుల‌న్నీ పూర్తి కాలేద‌ని.. అందుకే ఆయ‌న సీఎంవోకి రాకుండా ఇంటి వ‌ద్దే ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. చూస్తుంటే.. జ‌గ‌న్ కూడా న‌మ్మ‌కాల‌కు పెద్ద పీట వేయ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English