ఐదు రోజుల త‌ర్వాత అల‌క వీడి...రాహుల్ ఏం చేశారంటే...

ఐదు రోజుల త‌ర్వాత అల‌క వీడి...రాహుల్ ఏం చేశారంటే...

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం కాంగ్రెస్ పార్టీలో క‌లక‌లం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. అధికారానికి అతి ద‌గ్గ‌ర‌గా ఉన్నామ‌నుకున్న స్థితి నుంచి అమేథీ లాంటి సొంత ఇలాకాలోనూ కాంగ్రెస్ పార్టీ అడ్ర‌స్ గ‌ల్లంతు అవ‌డం తీవ్ర పరాభ‌వంగా మారింది. దీంతో కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేయ‌డానికి రాహుల్ గాంధీ సిద్ధ‌మయ్యారు. అయితే, గత ఐదు రోజులుగా ఇంటికే పరిమితమైన రాహుల్ గాంధీ గురువారం తొలిసారి బయటికొచ్చారు. వివిధ కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొన్నారు. దీంతోపాటుగా, త‌న ఓట‌మిపై స‌మీక్షించారు.

కాంగ్రెస్‌‌ చీఫ్‌‌ తన నివాసంలో కర్ణాటక సీఎం కుమారస్వామి గౌడతో భేటీ అయ్యారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ కూడా పాల్గొన్నట్లు తెలిసింది. కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సర్కారును కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం  చేయడం, సంక్షోభ నివారణ కోసం ఏఐసీసీ దూతలు బెంగళూరు వెళ్లడం తదితర పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రాజీనామాపై రాహుల్ మనసు మార్చుకోవాలని కుమారస్వామి కోరినట్లు తెలిసింది.

వర్తమాన రాజకీయాలతోపాటు ప్రతిపక్షాల సమావేశం నేప‌థ్యంలో...నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత శరద్ పవార్ ఇంటికెళ్లి సుమారు గంటపాటు చర్చలు జరిపారు. మరో ఐదు నెలల్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అంశం కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. రాజీనామా వద్దని  రాహుల్‌‌ను పవర్‌‌ వారించినట్లు తెలిసింది. ఇద్దరు నేతలు వివిధ రాజ‌కీయప‌ర‌మైన అంశాలు చర్చించుకున్నట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి.

ఇదిలాఉంటే, జూన్ 1న జరగనున్న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేపథ్యంలో సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఉదయం ఏఐసీసీ ఆఫీసులో మల్లికార్జున ఖర్గే, దిగ్విజన్ సింగ్లతో విడివిడిగా చర్చలు జరిపారు. ఈ సంద‌ర్భంగా విప‌క్ష నేత ఎంపిక‌పై సైతం చ‌ర్చ జ‌రిపిన‌ట్లు స‌మాచారం. అనంత‌రం సాయంత్రం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌మాణ‌స్వీకారం కార్య‌క్ర‌మంలో త‌న త‌ల్లి సోనియాగాంధీతో క‌లిసి పాల్గొన్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English