చిన్నపుడు మహేష్.. పెద్దయ్యాక ఎన్టీఆర్

చిన్నపుడు మహేష్.. పెద్దయ్యాక ఎన్టీఆర్

తెరమీదే కాదు.. బయట కూడా యాటిట్యూడ్ చూపించే, ఓపెన్‌గా మాట్లాడే కథానాయకుల్ని ఈ తరం యువ ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. విజయ్ దేవరకొండ ఇలాంటి యాటిట్యూడ్‌తోనే యూత్‌లో ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇప్పుడు మరో యంగ్ హీరో విశ్వక్సేన్ సైతం ఇదే బాటలో నడుస్తున్నట్లున్నాడు. తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో అతడికి యూత్‌లో బాగానే క్రేజ్ వచ్చింది.

సెన్సేషనల్ ప్రోమోలతో ఈ సినిమా విడుదలకు ముందు మంచి హైప్ తెచ్చుకుంది. మొన్న ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ ఎంత సెన్సేషనల్‌గా మాట్లాడాడో తెలిసిందే. తాజాగా తన సినిమా ప్రమోషన్ కోసం ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్న అతను యాంకర్‌కు దిమ్మదిరిగే షాకిచ్చాడు.

తెలుగులో మీ అభిమాన కథానాయకుడు ఎవరు అని విశ్వక్‌ను అడిగితే.. చిన్నప్పుడు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం ఉండేదని, కానీ పెద్దయ్యాక ఎన్టీఆర్ అభిమానిగా మారిపోయానని అన్నాడు. అదేంటి చిన్నపుడు మహేష్ ఫ్యాన్‌గా ఉండి.. తర్వాత ఎన్టీఆర్‌కు మారిపోయారు అని అడిగితే.. డిప్లమాటిక్ ఆన్సర్ ఏమీ ఇవ్వకుండా ‘అవ్వొద్దా’ అంటూ వెటకారంగా ప్రశ్నించాడు విశ్వక్.

అంతటితో ఆ చర్చను కట్ చేసిన విశ్వక్.. ఎన్టీఆర్‌లా నటించే హీరోను తాను ఇప్పటిదాకా చూడలేదన్నాడు. ఇండియాలోనే అతను బెస్ట్ యాక్టర్ అన్నాడు. తాను ఎంత బాగా నటించినా.. ‘యమదొంగ’లో యముడిగా చెప్పిన లెంగ్తీ డైలాగ్ మాత్రం ఎప్పటికీ చెప్పలేదనని.. అది ఎన్టీఆర్‌కు తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదని అన్నాడు. డ్యాన్సుల్లో కూడా ఎన్టీఆర్‌కు తిరుగులేదని విశ్వక్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English