11 మంది మంత్రుల‌ను మాజీల‌ను చేసిన మోదీ

11 మంది మంత్రుల‌ను మాజీల‌ను చేసిన మోదీ

న‌రేంద్ర‌మోదీ రెండో సారి భారీ మెజార్టీతో గెలిచి ప్ర‌ధాన‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం విప‌క్షాల‌కు మాత్ర‌మే షాక్ వంటిది కాదిన‌...ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌లో కొంద‌రికి సైతం ఇదే భావ‌న క‌లిగించేద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. మోదీ కేబినెట్ కూర్పు ఇందుకు తార్కాణ‌మ‌ని పేర్కొంటున్నారు. గురువారం రాత్రి 7 గంటలకు ప్రధానిగా మోడీ, మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్లోకి ఎవరెవరిని తీసుకోవాలన్న దానిపై మోడీ, అమిత్ షా బుధవారం సమావేశమై చర్చించారు. అమిత్ షా ఇంట్లో సుమారు నాలుగు గంటల పాటు ఈ భేటీ జరిగింది. కొందరు ముఖ్య నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశంలోనే కేబినెట్ బెర్త్లకు పలువురి పేర్లు ఖరారు చేసి ఇందులో 11 మంది గ‌త కేబినెట్లో ప‌నిచేసిన నేత‌ల‌కు షాకిచ్చారు.

మోదీ తొలి కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన మేనకా గాంధీ, మనోజ్‌ సిన్హా, జయంత్‌ సిన్హా, సురేష్ ప్రభు, కమల్ సింగ్‌, అనంత్‌ గీతే, రాధా మోహన్‌ సింగ్‌, అనంత్‌కుమార్‌ హెగ్డే, సత్యపాల్‌ సింగ్‌, గజేంద్ర షెకావత్‌, రామ్‌ కృపాల్‌లకు ఈసారి కొత్త కేబినెట్‌లో చోటు దక్కలేదు. మొత్తంగా 11 మంది తాజా మంత్రుల‌కు మోదీ షాకిచ్చారు. మ‌రోవైపు ప‌లువురు కొత్త‌వారికి, మిత్ర‌ప‌క్ష పార్టీల నేత‌ల‌కు మోదీ త‌న బృందంలో చాన్స్ ఇచ్చారు. అట్ట‌హాసంగా ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌మాణ స్వీకారం పూర్తి అయింది.

మ‌రోవైపు ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం అతిథులందరికీ విందు ఏర్పాటు చేశారు. విదేశీ ప్రతినిధులతోసహా ముఖ్యమైన 40 మంది అతిథులకు రాష్ట్రపతి ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. బిమ్‌స్టిక్ దేశాధినేతలతోపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తదితరులు ఈ విందుకు హాజరుకానున్నారు. రాత్రి 9 గంటలకు విందు ప్రారంభం అవుతుందని, వీరికోసం ప్రత్యేకంగా దాల్ రైసినాను వడ్డించనున్నట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. దీని తయారీకి కావాల్సిన పదార్థాలను లక్నో నుంచి ప్రత్యేకంగా తెప్పించామన్నారు. దీంతోపాటు శాఖాహార, మాంసాహార వంటకాలు వ‌డ్డించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English