జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం..బెజ‌వాడ‌లో కేసీఆర్ ఫ్యాన్స్ హ‌ల్‌చ‌ల్‌

జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం..బెజ‌వాడ‌లో కేసీఆర్ ఫ్యాన్స్ హ‌ల్‌చ‌ల్‌

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు  వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఏపీ రెండో ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణం స్వీకరించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మ‌రికొద్ది సేప‌ట్లో ఈ కార్య‌క్ర‌మం పూర్తికానుంది. గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్‌తో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. ముందు ప్రకటించినట్లు జగన్ ఒక్కరే ప్రమాణం స్వీకరిస్తారు. అనంతరం సీఎం హోదాలో జగన్ ప్రజలనుద్దేశించి తొలి ప్రసంగం చేస్తారు. ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపడంతోపాటు తన పాలనకు సంబంధించిన అంశాలను వివరిస్తారని వైఎస్సార్‌సీపీవర్గాలు తెలిపాయి. ముఖ్యంగా నవరత్నాలకు సంబంధించి కీలక ప్రకటనలు ఉంటాయనే ప్రచారం సాగుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్య‌క్ర‌మంలో కేసీఆర్ ఫ్యాన్స్ హ‌ల్‌చ‌ల్ కొన‌సాగుతోంది.

జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు గురువారం ఉదయం బెజవాడ బయల్దేరుతారు. ఆ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచే ఢిల్లీకి వెళ్లి, ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. అయితే, కేసీఆర్ విజ‌య‌వాడ వ‌స్తున్న కొంద‌రు నేత‌లు త‌మ‌ను తాము టీఆర్ఎస్ పార్టీ ఏపీ ప్ర‌తినిధులుగా పేర్కొంటూ ఫ్లెక్సీలు వేశారు. న‌గ‌రంలోని ప‌లుచోట్ల ఈ ఫ్లెక్సీల సంద‌డి క‌నిపిస్తోంది. మ‌రోవైపు, కొడాలి నాని ఫ్రెండ్స్ అసోసియేష‌న్ పేరుతో కూడా ప‌లువురు ఫ్లెక్సీలు వేశారు. ఈ రెండు ఫ్లెక్సీల‌లో కూడా వైసీపీ, టీఆర్ఎస్ నేత‌ల బొమ్మ‌లు ప‌లువురిని ఆక‌ర్షిస్తున్నాయి.

ఇదిలాఉండ‌గా, తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం ఉదయం హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి, 10.55 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డుమార్గంలో విజయవాడలోని గేట్‌వే హోటల్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.08 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి గేట్‌వే హోటల్‌కు చేరుకుంటారు. భోజనం అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు విమానంలో ఢిల్లీకి బయల్దేరుతారు. సాయంత్రం ఏడు గంటలకు ఢిల్లీలో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English