మోదీ ప్ర‌మాణ‌స్వీకారం..కేసీఆర్, జ‌గ‌న్ డుమ్మా ఎందుకంటే

మోదీ ప్ర‌మాణ‌స్వీకారం..కేసీఆర్, జ‌గ‌న్ డుమ్మా ఎందుకంటే

ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో  ప్ర‌ధానిగా రెండ‌వ‌సారి న‌రేంద్ర మోదీ ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. రాత్రి 7 గంట‌ల‌కు జ‌రిగే ఈ వేడుక‌లో పాల్గొనేందుకు సుమారు 8 వేల మంది అతిథులు వ‌స్తున్నారు. ప్ర‌మాణోత్స‌వానికి దేశ‌, విదేశీ ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతున్నారు. అయితే, తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు ఈ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోదీ ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రుకావ‌ద్ద‌ని డిసైడ్ అయ్యారు.

ఇవాళ రాత్రి 7 గంటలకో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌తో కలిసి ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే, చివ‌రి నిమిషంలో జ‌గ‌న్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నట్టు వైసీపీ శ్రేణులు తెలిపాయి. కాగా, ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశంగా  మారింది. ఇదిలాఉండ‌గా, పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ సైతం ఢిల్లీ వెళ్ల‌డం లేదు. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర సీఎం మీడియా అడ్వైజ‌ర్ స్ప‌ష్టం చేశారు. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా మోదీ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి వెళ్ల‌డం లేదు.

కాగా, మోదీ ప్రమాణస్వీకారం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా దిల్లీలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు షెడ్యూల్‌లో లేని ప్రత్యేక విమానాల ల్యాండింగ్‌ అనుమతులను పౌరవిమానాయానశాఖ, డీజీసీఏ రద్దు చేసింది. దీంతో ఈ ఇద్ద‌రు సీఎంలు హాజ‌రుకావ‌డం లేద‌ని స‌మాచారం. ఇదిలాఉండ‌గా, తన ప్రమాణస్వీకారం అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్... అక్కడే తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే నేత స్టాలిన్, ఇతర తెలంగాణ మంత్రులు, నేతలకు విందు ఏర్పాటు చేశారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English