బ్రేకింగ్: కిషన్‌రెడ్డికి కేంద్ర‌మంత్రి ప‌ద‌వి..

బ్రేకింగ్: కిషన్‌రెడ్డికి కేంద్ర‌మంత్రి ప‌ద‌వి..

రెండోసారి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించనున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ త‌న మంత్రివ‌ర్గ కూర్పుపై ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చారు. కేంద్ర మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టే నేత‌ల‌పై ఆయ‌న తుది నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ నేత కిష‌న్‌రెడ్డికి కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఖ‌రారు అయింది. ఈ మేర‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా ఆయ‌న‌కు ఫోన్ చేసి సాయంత్రం కేంద్ర‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయాల‌ని ఆహ్వానించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో  సికింద్రాబాద్‌ నుంచి కిష‌న్‌రెడ్డి గెలుపొందిన సంగ‌తి తెలిసిందే.

భారతీయ జనతా పార్టీ త‌ర‌ఫున తెలంగాణ రాష్ట్రంలో ఆది నుంచి కొన‌సాగిన కిష‌న్‌రెడ్డితో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు నేతలు తాజా ఎన్నిక‌ల్లో విజయకేతనం ఎగురవేశారు. నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అర్వింద్‌, కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌, ఆదిలాబాద్‌ లోక్‌సభ నుంచి గిరిజన నేత సోయం బాపూరావు గెలుపొందారు. అయితే, ఈ న‌లుగురిలో పార్టీకి విశేష సేవలందించిన కిషన్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న సంకేతాలు ముందుగానే వెలువడ్డాయి.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గురువారం రాత్రి కేంద్రమంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరుగుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉండాలని అధిష్టానం నుంచి సమాచారం అందడంతో కిషన్‌రెడ్డి బుధవారం ఉదయమే ఢిల్లీ చేరుకున్నారు. అప్పటికే ప్రధాని కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డికి సమాచారం అందిందని, అందువల్లే హుటాహుటిని బయలుదేరి హస్తినకు రావాలని కూడా కోరినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో బుధ‌వార‌మే కిష‌న్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాగా, గురువారం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా నుంచి ఆయ‌న‌కు ఫోన్ వ‌చ్చింది. దీంతో కిష‌న్‌రెడ్డి ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న అందుబాటులో ఉన్న‌రారు.  


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English