పవన్‌ను ఏకిపారేసిన వర్మ.. మరీ ఇంత దారణమా..?

పవన్‌ను ఏకిపారేసిన వర్మ.. మరీ ఇంత దారణమా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి ఇంకా తగ్గడం లేదు. ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా.. దాని తాలూకు హడావిడి ఇంకా దర్శనమిస్తూనే ఉంది. ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటుంటుండగా, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఓటమికి గల కారణాలను బేరీజు వేసుకుంటున్నాయి. ఇక, గురువారం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. గురువారం మధ్యాహ్నం 12.23 గంటల ముహూర్తానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది.

 ‘‘జగన్‌ నువ్వేలా సీఎం అవుతావో చూస్తా.. జగన్ నీకు మగతనం ఉందా..? జగన్ నువ్వు అసలు రెడ్డివేనా..? జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయాడు.. జగన్‌ చిన్న కోడికత్తికే గింజుకున్నాడు.. తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు.. రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా.. బెజవాడ గుండాల తోలు తీస్తా.. నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఆపేదెవడు? పాకిస్థాన్‌తో యుద్దం వస్తుందని నాకు ముందే తెలుసు.. థియేటర్‌లో జాతీయగీతం పాడితేనే దేశభక్తి ఉన్నట్లా..? హిందువులపై మస్లింల దాడులు సహించను.. ముస్లిమ్స్ దేశభక్తి నిరూపించుకోవాలా..? ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.. జగన్‌ అవిశ్వాసం పెడితే దేశం మొత్తం తిరిగి 50 మంది ఎంపీల మద్దతు కూడగడతా.. 2 లక్షల పుస్తకాలు చదివా..

 32 మార్కులతో 10 పాసయ్యా.. మా అన్నయ్య కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోతే సాక్షిలో నీచంగా రాశారు.(ఆమె వెళ్లిపోయింది 2007లో.. సాక్షి పేపర్‌ స్థాపించింది 2008 మార్చిలో)’ అంటూ పవన్ గతంలో అన్న మాటలను ప్రస్తావిస్తూ వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఈ మాటలు అన్నది ఎవరు..? అంటూ ప్రశ్నించారు. అయితే, ఈ ఒక్క ట్వీట్‌తోనే ఆపుతారా..? లేక ఇలా కొనసాగిస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో పవన్‌పై ఇదే తరహాలో ఆయన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. కాగా, కొద్దిరోజులుగా వర్మ.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశ్యించి పలు ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ద‌ృష్టిని పవన్ కల్యాణ్ వైపు మళ్లించారు. తర్వాత ఆయన ఎవరిని టార్గెట్ చేస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English