చిరంజీవి రానన్నాడు... పవన్‌ వెళతాడా?

చిరంజీవి రానన్నాడు... పవన్‌ వెళతాడా?

రేపు జరిగే జగన్‌ ప్రమాణ స్వీకారానికి మెగా బ్రదర్స్‌ ఇద్దరికీ స్వయంగా కొత్త సీఎం నుంచి ఆహ్వానం అందినట్టు సమాచారం. చిరంజీవికి, పవన్‌కి జగన్‌ స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించారట. అయితే చిరంజీవి తాను రాజకీయాలకి పూర్తిగా దూరమైన కారణంగా రాజకీయ సంబంధిత కార్యక్రమాలకి హాజరు కావడం లేదని, అన్యదా భావించవద్దని చెప్పేసాడట. అయితే ప్రైవేట్‌గా మాత్రం జగన్‌ని కలిసి అభినందించడానికి చిరంజీవి అపాయింట్‌మెంట్‌ అడిగినట్టు భోగట్టా.

మరోవైపు పవన్‌కళ్యాణ్‌కి ఆహ్వానం అందుతుందా లేదా అనే దానిపై నెలకొన్న ఉత్కంఠకి తెర పడింది. రాజకీయ రంగంలో ప్రత్యర్ధులు అయినా, ఒకరిపై ఒకరు ఎన్ని అభియోగాలు, ఆరోపణలు చేసుకున్నా కానీ ప్రమాణ స్వీకారానికి పవన్‌కి జగన్‌ ఆహ్వానం పలికారు. అయితే పవన్‌కళ్యాణ్‌ వెళ్లేదీ లేనిదీ రేపు క్లారిటీ వస్తుంది. ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత పవన్‌ మీడియా ముందుకి రావడం లేదు. జనసేన పార్టీ తదుపరి కార్యాచరణ గురించి సీనియర్‌ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English