కేసీఆర్‌ను వ‌దిలి జ‌గ‌న్‌ వైపు ఐఏఎస్‌లు ఎందుకు వెళ్తున్నారంటే

కేసీఆర్‌ను వ‌దిలి జ‌గ‌న్‌ వైపు ఐఏఎస్‌లు ఎందుకు వెళ్తున్నారంటే

ఒక‌రి వెంట మ‌రొక‌రు అన్న‌ట్లుగా...ఏపీలో ప‌నిచేసేందుకు ఐఏఎస్‌లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సీనియ‌ర్ పోలీస్ అధికారి స్టీఫెన్ ర‌వీంద్ర‌, ఆయ‌న అనంత‌రం సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ శ్రీ‌ల‌క్ష్మి ఏపీలో ప‌నిచేసేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటుగా మ‌రికొందరు సైతం లైన్లో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఎందుకు ఇంద‌రు ఐఏఎస్‌లు జ‌గ‌న్ ప‌రిపాల‌న ఇంకా ప్రారంభం కాక‌ముందే...ఏపీకి వెళ్లాల‌ని భావిస్తున్నార‌నే చ‌ర్చ స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తోంది. తెలంగాణలో వివక్షకు గురవుతుండ‌ట‌మే కొందరు సీనియర్‌ ఐఏఎస్‌లు ఆంధ్రాకు వెళ్లే ఆలోచనకు కార‌ణం అంటున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌లలో 40 మంది అధికారులను కేంద్ర మోం మంత్రిత్వ శాఖ తెలంగాణ క్యాడర్‌కు కేటాయించింది. ఇప్పుడు అందులోనుంచే కొందరు తిరిగి ఏపీ క్యాడర్‌కు మారాలనుకుంటున్నారు. ఇక్కడ అప్రధానమైన పోస్టుల్లో కొనసాగేకన్నా ఏపీకి వెళ్లాలనే యోచనలో ఉన్నారు. ఇందుకు కారణం జూనియర్ల ముందు సీనియర్లు చేతులు కట్టుకుని నిలబడలేకనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.. పని చేస్తున్న చోట అవమానాలు పడేకన్నా పొరుగు రాష్ట్రానికి వెళ్లడమే మంచిదన్న ఉద్దేశంలో కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఉన్నట్టు సమాచారం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తమను అప్రధానమైన పోస్టింగ్‌లకే పరిమితం చేస్తున్నారని గత కొన్ని నెలలుగా కొందరు ఐఏఎస్‌లు ఆందోళన వ్యక్త చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త జిల్లాల్లో తమను కాదని నాన్‌ క్యాడర్‌ ఐఏఎస్‌లను నియమించడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. కన్ఫర్డ్‌ ఐఏస్‌లకు కీలకమైన శాఖలను ఇచ్చి నేరుగా నియమితులైన ఐఏఎస్‌లను మాత్రం మామూలు పోస్టింగ్‌లకు బదిలీ చేశారన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతున్నది. ఈ విషయంపై కొందరు సీనియర్‌ ఐఏఎస్‌లు ప్రభుత్వంపై బాహాటంగా విమర్శలు కూడా చేశారు.

తెలంగాణ క్యాడర్‌ నుంచి తమను మార్చాలంటూ కొందరు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. కొంతమంది ఏపీకి వెళ్లాలనుకున్నా ఆ సమయంలో అక్కడ సీఎంగా చంద్రబాబు ఉండటంతో వారు వెనకడుగు వేశారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో అసంతృప్తిగా ఉన్న ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రానికి చెందిన కొందరు ఐఏఎస్‌లు ఇప్పటికే ఏపీలోని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో భేటీ అయినట్టు సమాచారం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే కేంద్రం నుంచి ఎలాగైనా తాము ఏపీకి బదిలీ చేయించుకుంటామని, ఇందుకు వారి సహకారాన్ని కోరినట్టు తెలిసింది. కాగా, పెద్ద ఎత్తున ఐఏఎస్‌లు ఏపీకి వెళ్ల‌డం స‌హ‌జంగానే చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English