పవన్‌కి ఇప్పుడు న్యూస్‌ ఛానల్‌ దేనికి?

పవన్‌కి ఇప్పుడు న్యూస్‌ ఛానల్‌ దేనికి?

పవన్‌కళ్యాణ్‌ దారుణ పరాజయం తర్వాత వచ్చే ఎన్నికల నాటికి అయినా సొంత న్యూస్‌ ఛానల్‌ వుండి తీరాల్సినదే అని అభిమానులు పోరు పెడుతున్నారు. గత ఎన్నికల ప్రచారంలో పవన్‌కి అసలు ప్రచారం దక్కలేదనేది తెలిసిందే. దీంతో పవన్‌ని తొక్కేయాలని మీడియా ట్రై చేస్తోందని, ప్రజారాజ్యం టైమ్‌లో జరిగినదే రిపీట్‌ అయిందని ఫాన్స్‌ వాపోతున్నారు. అయితే అభిమానులు ఇక్కడో లాజిక్‌ మరచిపోతున్నారు. ఇంతకు ముందయితే పవన్‌కి సొంత పత్రికలు, ఛానళ్ల అవసరం వుందేమో కానీ ఇప్పుడు మాత్రం లేదు.

శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టుగా... జగన్‌ని తీవ్రంగా వ్యతిరేకించే పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు తెలుగుదేశం పక్ష పత్రికలు, మీడియాకి కూడా కావాల్సినవాడే. గతంలో అతను ప్రభుత్వానికి ఎదురు తిరిగితే ప్రచారం లభించలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వమే వారికి యాంటీ ఆయె. అందుకే ఇప్పుడు పవన్‌ ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేక కామెంట్‌ చేసినా, చర్యకి పాల్పడినా విస్తృత ప్రచారం దక్కుతుంది. దీనిని పవన్‌ కళ్యాణ్‌ భేషుగ్గా వాడుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వం అన్నీ జనామోద చర్యలే చేయదు కనుక వారి తరఫున పోరాటానికి పవన్‌ సరయిన ప్రణాళికతో దిగాలి. అప్పుడు తనకి తెలుగుదేశం మీడియాలో కవరేజీ భేషుగ్గా దక్కుతుంది. అయితే నాగబాబు చెప్పినట్టుగా ఇమ్మీడియట్‌గా ప్రభుత్వాన్ని వ్యతిరేకించకుండా జగన్‌కి కనీసం ఏడాది బ్రీతింగ్‌ స్పేస్‌ ఇచ్చి అప్పుడు ఏవయినా తప్పులుంటే ఎండగట్టాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English