పవన్‌కళ్యాణ్‌ ఈ 'వేషాలు' మానేయాలిక

పవన్‌కళ్యాణ్‌ ఈ 'వేషాలు' మానేయాలిక

పవన్‌కళ్యాణ్‌ రాజకీయ వేదిక ఎక్కాలనుకునే ప్రతిసారీ కొన్నాళ్ల పాటు గడ్డం పెంచేసి, తెల్ల పంచె కట్టుకుని, జుట్టు పెంచుకుని వస్తాడు. సినిమాల్లో మనకి తెలిసిన పవన్‌ అలా వుండడు. పొలిటికల్‌ ఫీల్డ్‌ కోసం పవన్‌ ఎంచుకున్న 'గెటప్‌' ఇది. జనసేన అనౌన్స్‌ చేసినపుడు, 2014 ఎన్నికల ప్రచార సమయంలో పవన్‌ కుర్తాలు ధరించాడు. కాటన్‌ ప్యాంట్లు, కుర్తాలు, గడ్డం బాగానే సూటయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్ల గుబురు గడ్డం వేసుకుని బాబాలా తిరిగాడు. ఈ ఎన్నికల ప్రచారంలోను పంచె కట్టుకుని, గడ్డం, జుట్టు పెంచుకుని కనిపించాడు. అది సింప్లిసిటీ అని, తనని సీరియస్‌గా తీసుకుంటారని పవన్‌ భావిస్తున్నాడు. కానీ అది 'డ్రామా'ని తలపిస్తోందని, తనలోని సీరియస్‌నెస్‌ని తెలియనివ్వకుండా ఈ వేషం డామినేట్‌ చేస్తోందని అభిమానులు సయితం సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు.

ఇక మట్టి ముంతలో మజ్జిగన్నం తినడం, ఆ ఫోటోషూట్‌ ఫోటోలు మీడియాలో రావడం, రైల్లో గుమ్మం దగ్గర కూర్చుని కొబ్బరిబొండాం తాగడం... ఆ ఫోటోలు కూడా ఇంటర్నెట్‌లో పెట్టడం లాంటివి పవన్‌ని డ్రామా ఆర్టిస్టులా చూపించాయి. జగన్‌ కానీ, చంద్రబాబు కానీ ఇలాంటి డ్రామా లేకుండానే మామూలుగా ఎప్పటిలా కనిపిస్తూ వుంటారు. కానీ పవన్‌ మాత్రం తన ప్రతి చర్యలోను డ్రామా పండించాలని చూస్తాడు. ఈ తరహా వేషాలు కూడా కల్ట్‌ ఫాన్స్‌ తప్ప మిగతావాళ్లు పవన్‌ని లైట్‌ తీసుకోవడానికి కారణమయ్యాయి. ఇక మీదటైనా పవన్‌ ఇలాంటి ప్రత్యే వేషధారణ మానేసి సింపుల్‌గా, సినిమాల్లో కనిపించే మాదిరిగా వుంటే బాగుంటుంది. ఎలాగో పవన్‌కి సినిమాల్లోను గడ్డం గెటప్‌ అచ్చి రాలేదు. గడ్డంతో నటించిన పంజా సినిమా అట్టర్‌ ఫ్లాపయింది. అది గమనించి అయినా ఇకపై మామూలుగా కనిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English