పవన్ కళ్యాణ్ క్లీన్ మెసేజ్ ఇచ్చాడు

పవన్ కళ్యాణ్ క్లీన్ మెసేజ్ ఇచ్చాడు

ఆ పాత కాలంలో.. ముందుగా ఎంజిఆర్, తరువాత ఎన్టీఆర్, ఇక నార్త్ లో రాజేశ్‌ ఖన్నా, శత్రుఘన్ సిన్హా, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లందరూ వన్ బై వన్ రాజకీయాల్లోకి వచ్చేశారు. తెలుగులో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఏకంగా ప్రధాన రాజకీయ పక్షం అయిన కాంగ్రెస్ పార్టీకి చెమట్లు పట్టించేసింది. అయితే తరువాత మెగాస్టార్ చిరు, రజనీకాంత్, కమల్ హాసన్ మరియు పవన్ కళ్యాణ్‌ వంటి స్టార్లు రాజకీయ ప్రవేశం చేసి పార్టీలు స్థాపించారు. కాని అక్కడే ఉంది అసలు కథ.

నిజానికి అప్పట్లో సినిమా హీరో వచ్చి రియల్ లైఫ్‌ లో నాలుగు స్పీచులు ఇవ్వగానే ఓట్లు పడిపోయేవి. కాకపోతే ఇప్పుడు అలా జరగడం కష్టం అంటూ ఆల్రెడీ చిరంజీవి తెలుగునాట ప్రూవ్ చేశారు. అయినాసరే రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ రాజకీయ ఆరంగేట్రం చేసి పార్టీ పెట్టేశారు. కట్ చేస్తే పవన్ కళ్యాణ్‌ కూడా జనసేన అనేశారు. కాని చిరంజీవి నాటికే కాస్త  దారుణంగా ఉన్న రాజకీయ ఆరంగేట్రాలు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ అండ్ కమల్ హాసన్ ఓటములతో ఇంకా క్రింద స్థాయికి వెళ్ళిపోయాయ్. జస్ట్ సినిమా స్టార్ అన్నంతమాత్రాన ఓట్లు పడట్లేదు. జనాలు నమ్మట్లేదు. కొంతమంది నమ్మినా కూడా గెలవడానికి ఆ సపోర్టు సరిపోవట్లేదు.

ఇకమీదట టాలీవుడ్ నుండి ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే మాత్రం.. ఒకటికి మూడుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్‌ వంటి సూపర్ క్రేజ్ ఉన్న స్టారుకే ఒక పార్టీ పెట్టేసి గెలవడం సాధ్యంకాలేదంటే.. ఇతర హీరోలకు ఇంకా కష్టమే. అయితే ఇప్పుడున్న టాప్ పార్టీస్ ఒకదానిలో చేరిపోవాలి, లేదంటే రాజకీయాలకు దూరంగా ఉండిపోవాలి. ఒకవేళ రావలంటే మాత్రం.. ఒక వెయ్యి కోట్లు క్యాపిటల్ పెట్టుకుని.. ఐదు సంవత్సరాలు పాటు జనాల్లో యాత్రలు చేసి.. అప్పుడు ఎలక్షన్లకు సన్నద్దమవ్వాలి. అదే పవన్ ఇచ్చిన క్లీన్ మెసేజ్.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English