జగనన్నా... పాపం వీళ్లని గుర్తించు!

జగనన్నా... పాపం వీళ్లని గుర్తించు!

వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజలతో మమేకం అయిపోయి, ఎనిమిదేళ్ల పాటు అవిశ్రాంతంగా చేసిన కృషికి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆంధ్ర ప్రజలు పట్టం కట్టారు. అయితే జగన్‌ కష్టం సంగతి అటుంచి ఈ విజయంలో క్రెడిట్‌ తీసుకోవడానికి లేట్‌ ఎంట్రీలయిన జీవితా రాజశేఖర్‌లు తెగ తపన పడుతున్నారు. పూటకో కూర తిన్న చందంగా ప్రతి ఎలక్షన్‌కో పార్టీ మారిపోయే ఈ జంట జగన్‌తో ముందు నుంచీ అనుబంధం పెట్టుకుని వుంటే ఈ విజయానికి క్రెడిట్‌ తీసుకున్నా ఒక అందం. కానీ ఎన్నికలకి ముందుగా పార్టీ కండువా కప్పుకున్న వీళ్లు ఈ విజయమేదో తమవల్లే సాధ్యమయిందన్నట్టు మీడియా మీట్లు కూడా పెట్టడం పట్ల జనం కామెడీ చేసుకుంటున్నారు.

గరుడవేగతో పేరు తెచ్చుకుని, కల్కి చిత్రానికి జనం దృష్టిని ఆకర్షిస్తోన్న రాజశేఖర్‌ మరోసారి మునుపటి బ్యాడ్‌ ఇమేజ్‌ తెచ్చుకునేలా వ్యవహరిస్తున్నాడని, అతనికి రాజకీయాల పట్ల అంత ఆసక్తి వున్నట్టయితే నేరుగా పోటీకి దిగేందుకు టికెట్‌ అడగాలే తప్ప ఇలా అవతలి వాళ్లని గిల్లడానికి చూడకూడదని, ఒక టైమ్‌లో చిరంజీవిని నానా మాటలు అన్న ఈ జంట గరుడవేగ చిత్రం సమయంలో చిరంజీవి ప్రాపకం కోసం పాకులాడినది ఎవరూ మరచిపోలేదింకా. కానీ ఇంతలోనే జగన్మోహన రథ చక్రాలు పరుగెత్తడానికి ఆయిల్‌ పోసింది తామే అన్నట్టుగా క్రెడిట్‌ కోసం ఈ ఆరాటమేంటని జనం జోకులేస్తున్నారు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English