పవన్‌ కళ్యాణ్‌ ఫాన్స్‌ సూపర్‌ అంతే!

పవన్‌ కళ్యాణ్‌ ఫాన్స్‌ సూపర్‌ అంతే!

సినిమాల్లో నంబర్‌వన్‌గా వెలుగుతోన్న హీరో కనీసం ఇంకో పదేళ్ల కెరియర్‌ వుండగానే రాజకీయాల బాట పడితే అభిమానులకి చాలా బాధగా వుంటుంది. అదే హీరో రాజకీయాల్లో అట్టర్‌ ఫ్లాపయి తొలి ప్రయత్నంలో కనీసం తాను కూడా గెలవకపోతే ఫాన్స్‌కి తల కొట్టేసినట్టు వుంటుంది. అయితే జనసేన ఫస్ట్‌ అటెంప్ట్‌ ఫెయిల్‌ అయినా కానీ అభిమానులు త్వరగానే కోలుకున్నారు. 'ఎందుకొచ్చిన రాజకీయాలు తిరిగి సినిమాల్లోకి వచ్చేయ్‌ అన్నయ్యా' అంటూ అతడిని కోరడం లేదు. గెలిచే వరకు పోరాడుతూనే వుండమని పవన్‌కి ధైర్యాన్ని నూరి పోస్తున్నారు. అక్కడితో ఆగడం లేదు. పార్టీకి సరిపడా నిధులు లేవు కనుక తమ జీతంలో కొంత నెల నెలా పార్టీ ఫండ్‌కి ఇవ్వడానికి కూడా చాలా మంది నిర్ణయించుకున్నారు.

మొదటి ప్రయత్నంలో కొన్ని తప్పులు జరిగాయని, పోరాడితే పవన్‌కళ్యాణ్‌ ఖచ్చితంగా తర్వాత ప్రజల నమ్మకాన్ని గెలుచుకోగలడని ఫాన్స్‌ నమ్ముతున్నారు. ప్రజారాజ్యాన్ని విలీనం చేసి చిరంజీవి చేసిన తప్పుని పవన్‌ రిపీట్‌ చేయకూడదని, వెన్ను చూపి వచ్చి తిరిగి సినిమాల్లో హీరోయిజం చూపిస్తే చూడలేమని ఓపెన్‌గానే చెబుతున్నారు. పవన్‌ తన ట్విట్టర్‌ ఫీడ్‌ చూసుకున్నా కానీ అభిమానుల పల్స్‌ ఏమిటనేది అతనికి క్లియర్‌గా తెలిసిపోతుంది. వారు తననుంచి ఏమి ఆశిస్తున్నారనేది కూడా స్పష్టమైన అవగాహన వస్తుంది. ఫాన్స్‌ ఇస్తోన్న స్ఫూర్తితో పవన్‌ రెట్టించిన ఉత్సాహంతో కదన రంగంలోకి దిగుతాడా లేదా అనేది కాలమే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English