తండ్రి క‌ట్టించిన క్యాంప్ ఆఫీసులోకి జ‌గ‌న్‌..ప‌దేళ్ల త‌ర్వాత రికార్డు

తండ్రి క‌ట్టించిన క్యాంప్ ఆఫీసులోకి జ‌గ‌న్‌..ప‌దేళ్ల త‌ర్వాత రికార్డు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్న వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక‌త‌ను చాటుకోనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఎన్నిక‌న జ‌గన్ ఈ ప్ర‌క్రియ‌కు సంబంధించిన స‌మాచారం ఇస్తూ, తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌తో స‌మావేశం అయిన సంద‌ర్భంలో కీల‌క ఘ‌ట్ట‌మ‌ని పేర్కొంటున్నారు. పక్కనే ఉన్న దిల్ కుష గెస్ట్ హౌజ్ కు కొన్నేళ్ల కింద నిందితుడిగా వచ్చి అరెస్ట్ అయిన జగన్, ఇప్పుడు రాజ్ భవన్ కు సీఎంగా వచ్చాడని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

హైద‌రాబాద్ సోమాజిగూడ‌లో గ‌వ‌ర్న‌ర్ నివాస‌మైన రాజ్‌భ‌వ‌న్ ప‌క్క‌నే దిల్‌కుష గెస్ట్ హౌజ్ ఉంది. ఈ రెంటిని క‌ల‌గ‌లిపి ప‌లువురు ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ చేస్తున్నారు. ``పక్కనే ఉన్న దిల్ కుష గెస్ట్ హౌజ్‌కు కొన్నేళ్ల కింద నిందితుడిగా వచ్చి అరెస్ట్ అయిన జగన్, ఇప్పుడు రాజ్ భవన్ కు సీఎంగా వచ్చాడు.`` అని వ్యాఖ్యానిస్తున్నారు. ఏ రోడ్డులో అయితే అరెస్ట్ అయ్యాడో అదే రోడ్డులో ముఖ్యమంత్రిగా అడుగిడాడని మ‌రి కొంద‌రు అంటున్నారు.

మ‌రోవైపు, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో వైఎస్ జ‌గన్ స‌మావేశం అవ‌డంపై ప‌లువురు ఆస‌క్తిక‌ర రీతిలో వ్య‌క్తిక‌రిస్తున్నారు. 10 ఏళ్ల తరువాత తన తండ్రి కట్టించిన క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి కొడుకు గా బయటకు వెళ్లి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో అదే క్యాంప్ ఆఫీసులో జగన్ అడుగుపెడుతున్నాడ‌ని అంటున్నారు. రికార్డు స్థాయి మెజార్టీతో విజ‌యం సాధించిన వైఎస్ జ‌గ‌న్‌, త‌న హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో కూడా అదే రీతిలో స్పందిస్తున్నార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English