ల‌గ‌డ‌పాటి స‌న్యాసం...ఇంత‌కంటే ఇంకే చేయ‌గ‌ల‌డు పాపం

ల‌గ‌డ‌పాటి స‌న్యాసం...ఇంత‌కంటే ఇంకే చేయ‌గ‌ల‌డు పాపం

ఆంధ్రా ఆక్టోప‌స్‌గా పేరొందిన మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నిక‌ల జోస్యాల‌కు సుప‌రిచితుడు అయిన ల‌గ‌డ‌పాటి అంచ‌నాలు తాజా ఎన్నిక‌ల్లో ఘోరంగా బెడిసికొట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీలో వెలువడిన అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికల ఫలితాలపై లగడపాటి రాజగోపాల్ స్పందిస్తూ ఫలితాల్లో తన సర్వే విఫలమైందనే విషయంపై  మీడియాకు ఓ ప్రెస్ నోట్ పంపారు. ఎప్పుడైన మీడియాతో మాట్లాడే దానికి భిన్నంగా ప్రెస్‌నోట్ పంప‌డ‌మే కాకుండా...సంచ‌ల‌న నిర్ణ‌యం వెలువ‌రించారు.

2004 నుంచి సర్వేలు తనకు ఒక వ్యాపకంగా మారాయని, ప్రజల నాడి ఎవరికి అనుకూలమైనా, వ్యతిరేకమైనా కూడా పక్షపాతం లేకుండా చెప్పానని లగడపాటి అన్నారు. అలాగే ఏపీ, తెలంగాణలో కూడా మీడియా ద్వారా సర్వే వివరాలను ప్రజలకు వివరించానని అన్నారు. డిసెంబర్ లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ,  ఏప్రిల్ లో జరిగిన ఏపీ ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నానని ల‌గ‌డ‌పాటి ప్రకటించారు. ఇందుకు కారణాలు ఏమైనా సరే వరుసగా రెండు సార్లు విఫలమయ్యానని, ఇకపై భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని సంచలన ప్రకటన చేశారు.

2014 లో కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఎంపీ పదవికి రాజీనామా చేశానని, ఆ తర్వాత రాజకీయాల నుంచి విరమించుకున్నానని ల‌గ‌డ‌పాటి తెలిపారు.అప్పటి నుంచి తాను ఏ పార్టీకీ అనుబంధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. తన ఫలితాల వల్ల ఎవరైనా నొచ్చుకొని ఉంటే మన్నించమని కోరారు.  ఇక నూతన సీఎంగా బాధ్యతలు చేపడుతున్న వైఎస్ జగన్‌కు  లగడపాటి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాభివృద్ధికి, నూతన ప్రభుత్వానికి తోడ్పడాలని ఆయన కోరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English