బాబుకు క‌లిసిరాని ఒంట‌రిపోరు..ఘోర ప‌రాజ‌య‌మే తార్కాణం

బాబుకు క‌లిసిరాని ఒంట‌రిపోరు..ఘోర ప‌రాజ‌య‌మే తార్కాణం

కేబినెట్ మంత్రులు, ఎంపీలు, సీనియ‌ర్ నేత‌లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సంద‌ట్లో సడేమియాల జంప్ జిలానీలు...ఇలా ఏ ఒక్క‌రూ మిన‌హాయింపు లేకుండా...తెలుగుదేశం పార్టీ నేత‌ల్లోని అన్నివ‌ర్గాలు ఘోర‌ప‌రాజ‌యం పాల‌య్యారు. స్ప‌ష్టంగా చెప్పాలంటే...తెలుగుదేశం పార్టీ చ‌రిత్ర‌లో లేనివిధంగా తీవ్ర ప‌రాజ‌యం సైకిల్ పార్టీ అడ్ర‌స్ గ‌ల్లంతు అయిపోయింది. ఈ ఓట‌మి సంద‌ర్భంగా రాజ‌కీయ విశ్లేష‌కులు ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ చేస్తున్నారు. రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకొనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా బ‌రిలో దిగిన తొలి ఎన్నిక‌లోనే....తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని పేర్కొంటున్నారు.

యువ‌జ‌న కాంగ్రెస్ నేత‌గా, కాంగ్రెస్‌లో తన రాజకీయప్రస్థానాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అనంత‌రం మామ ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీలో చేరారు. ఆపై జరిగిన రాజకీయ పరిమాణాలు.. వెన్నుపోటు రాజకీయాల నేపథ్యంలో ఎన్టీఆర్‌ సీఎం కుర్చీని చంద్రబాబు లాగేసుకున్నారు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ తొలిసారిగా పోటీచేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు వాజపేయి ప్రభతో గట్టెక్కారు. ఆ తరువాత అలిపిరి ఘటనతో తనతోపాటు కేంద్రంలోని ఎన్డీయేను కూడా ముందస్తుకు నడిపించి.. 2004 ఎన్నికల్లో బొక్కా బోర్లాపడ్డారు. 2009లో మ‌హాకూట‌మిగా బ‌రిలో దిగిన చంద్ర‌బాబు ఓట‌మి పాల‌య్యారు.  2014 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌-బీజేపీతో క‌లిసి టీడీపీ పొత్తు పెట్టుకొని గెలుపొందింది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఒంట‌రి పోరాటం చేశారు.

అయితే, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ఎన్నికలనగానే పొత్తులకోసం పక్కచూపులు చూడడం ఆనవాయితీకి భిన్నంగా సాగిన ఈ ప‌య‌నం చంద్ర‌బాబుకు చేదు అనుభ‌వాన్నే మిగిల్చింది. త‌న‌తో పాటు ముఖ్య నేత‌ల‌ను షాక్‌కు గురి చేసే ఓట‌మిని అందించింది. తెలుగుదేశం పార్టీ భ‌విష్య‌త్‌పై నీలి నీడ‌లు క‌మ్ముకునేలా ఓట‌మిని అందించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English