అప్పుడు వైఎస్.. తర్వాత బాబు.. ఇప్పుడు జగన్

అప్పుడు వైఎస్.. తర్వాత బాబు.. ఇప్పుడు జగన్

మరోసారి రుజువైంది.. రాజకీయ నాయకులు జనాలకు చేరువ కావడానికి, వారి మనసులు గెలవడానికి పాదయాత్రను మించిన మార్గం మరొకటి లేదని. 2004 ఎన్నికలకు ముందు తన విజయంపై ధీమా లేని సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి అద్భుతమైన ఫలితాన్ని రాబట్టారు. జననేతగా మారిపోయాడు. ఎన్నికల్లో భారీ విజయం సాధించాడు. ఆ పాదయాత్ర దేశవ్యాప్తంగా చర్చనీయంశమైంది. అదొక రోల్ మోడల్ లాగా నిలిచింది. ఇక ఆ తర్వాత చంద్రబాబు సైతం వైఎస్‌ను అనుసరించాడు. 2014 ఎన్నికలకు ముందు భారీ స్థాయిలో పాదయాత్ర చేపట్టాడు. వైఎస్ రికార్డును తిరగరాశాడు. ఆయనకు కూడా ఈ యాత్ర బాగానే కలిసొచ్చింది. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది.

ఇప్పుడు వైఎస్ జగన్‌ను విజేతగా నిలబెట్టిన ముఖ్య కారణాల్లో పాదయాత్ర ఒకటనడంలో సందేహం లేదు. అంతకుముందే ఓదార్పు యాత్ర పేరుతో జనాల్లో తిరిగాడు జగన్. ఇక 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తర్వాతి ఏడాదే పాదయాత్ర మొదలుపెట్టాడు. దేశంలో మరే నాయకుడూ తిరగని స్థాయిలో తిరిగాడు. మూడేళ్లకు పైగా జనాల్లోనే ఉన్నాడు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో చుట్టేశాడు. దాదాపు 3800 కిలోమీటర్ల దూరం నడిచి రికార్డు నెలకొల్పాడు. దీంతో క్షేత్రస్థాయిలో వైకాపా బాగా జనాల్లోకి వెళ్లింది. జగన్ మీద జనాల్లో అభిమనం పెల్లుబికింది. పాదయాత్ర ప్రభావాన్ని టీడీపీ నాయకులు చాలా తక్కువ అంచనా వేశారు. ఆ యాత్రతో జగన్ ఇప్పుడు అసాధారణ విజయాన్నందుకున్నాడు. మొత్తానికి పాదయాత్ర అనేది పెద్ద ఎన్నికల గెలుపు సాధనంగా మారిపోయింది తాజా ఫలితంతో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English