తెలంగాణలో భాజపా సంచలనమే

తెలంగాణలో భాజపా సంచలనమే

దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు రాబడుతోంది భారతీయ జనతా పార్టీ. ఉత్తరాదిన రాష్ట్రాలకు రాష్ట్రాల్ని ఆ పార్టీ స్వీప్ చేసేస్తోంది. 2014కు ముందు పదేళ్లు అధికారంలో ఉన్న యూపీఏ సర్కారుపై వచ్చిన వ్యతిరేకత భాజపాకు కలిసొచ్చి ఆ పార్టీ ఘనవిజయం సాధించింది. కానీ మోడీ ఐదేళ్లు పాలించాక ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఒకవేళ గెలిచినా.. గత పర్యాయంలాంటి వేవ్ ఉండదనే అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా గత ఎన్నికలకు దీటుగా ఫలితాలు సాధిస్తోందా పార్టీ. ఐతే దేశం మొత్తంలో భాజపా అత్యంత ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కావడం విశేషం. ఆ పార్టీకి ఇక్కడ నాలుగు ఎంపీ స్థానాలు పక్కాగా దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరు నెలల కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తిన్న పార్టీ.. పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి ఈ స్థాయిలో పుంజుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు.

సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో భాజపా అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. వాళ్ల విజయం దాదాపు ఖరారైపోయింది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కిషన్ రెడ్డి సికింద్రబాీద్ స్థానం నుంచి ఎంపీ కాబోతున్నట్లే కనిపిస్తోంది. ఆయన మధ్యాహ్నం  12.30 ప్రాంతంలో 32 వేలకు పైగా ఆధిక్యంతో కొనసాగుతున్నాడు. నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్ తనయురాలు, సిట్టింగ్ ఎంపీ కవితపై అరవింద్ 56 వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం. కవిత ఓటమి దాదాపు ఖాయమే. కరీంనగర్‌లో సిట్టింగ్ ఎంపీ వినోద్ మీద భాజపా అభ్యర్థి50 వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఆదిలాబాద్ ‌లోనూ భాజపా అభ్యర్థి సోయం బాపూరావు 36 వేల ఆధిక్యంలో ఉన్నాడు. ఇంత ఆధిక్యం అంటే.. భాజపా అభ్యర్థుల విజయం దాదాపు ఖాయమన్నట్లే. కాంగ్రెస్ పార్టీ సైతం 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ సగానికి సగం స్థానాల్లో ఓటమి పాలవడం అంటే అనూహ్యమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English