టీడీపీ వరల్డ్ కప్ సెంటిమెంటు బెడిసికొట్టింది

టీడీపీ వరల్డ్ కప్ సెంటిమెంటు బెడిసికొట్టింది

మన జనాలు సెంటిమెంటు ప్రియులు. తమకు అనుకూలమైన సెంటిమెంట్లను తెరమీదికి తెచ్చి ఒక రకమైన ఆనందంలో మునిగితేలుతుంటారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలిచే అవకాశాలున్నట్లు మెజారిటీ సర్వేలు ఘోషించినా తెలుగుదేేశం పార్టీ మద్దతుదారులు అంగీకరించలేదు. ఒక విచిత్రమైన సెంటిమెంటును తెరపైకి తెచ్చి తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని ఆశల్లో మునిగితేలడం విశేషం. అదేంటంటే.. 1983లో ఇంగ్లాండ్ వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చినపుడు తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించిందట. ఆ పార్టీకి అవే తొలి ఎన్నికలన్న సంగతి తెలిసిందే.

ఆ తర్వాత మళ్లీ 1999లో జరిగిన ప్రపంచకప్‌కు కూడా ఇంగ్లాండే ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోనే తెలుగుదేశం పార్టీనే గెలిచింది. ఇప్పుడు మళ్లీ వన్డే ప్రపంచకప్ వచ్చింది. దాని వేదిక ఇంగ్లాండే. కాబట్టి ఇప్పుడు కూడా సెంటిమెంట్ వర్కవుట్ అయి తెలుగుదేశం పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించబోతోందని గత కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు మీమ్స్ తయారు చేసి ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు. కానీ ఆ సెంటిమెంటు తిరగబడింది. ఏపీ ఎన్నికల్లో ఈసారి తెలుగుదేశం పార్టీ దారుణ పరాభవం మూటగట్టుకుంటోంది. ఇలాంటి చాలా సెంటిమెంట్లకు ఎన్నికల ఫలితాలు పాతర వేశాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English