కన్ఫమ్.. చంద్రబాబు అండ్ కో ఆయుధం ఇదే

కన్ఫమ్.. చంద్రబాబు అండ్ కో ఆయుధం ఇదే

మొత్తానికి ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సాగినట్లు స్పష్టమవుతోంది. మరీ ఈ స్థాయిలో ఏక పక్ష విజయం ఎవ్వరూ ఊహించలేదు. కేంద్రలో మోడీ సర్కారు అయినా ఘనవిజయం సాధిస్తుందని అనుకున్నారు  కానీ.. ఏఏపీలో వైకాపా ఈ స్థాయిలో భారీ విజయం సాధించడం మాత్రం ఎవ్వరూ అంచనా వేయలేదు.

హోరా హోరీ పోరులో కాస్త ఆధిక్యంతో ఆ పార్టీ గట్టెక్కవచ్చని అనుకున్నారు. కానీ ఏకంగా 50 శాతానికి పైగా ఓటు షేర్, 150కి పైగా సీట్లు సాధించబోతుండటం మాత్రం సంచలనమే. ఇక భాజపా సైతం ఇదే స్థాయి విజయాన్ని అందుకుంటోంది. ఐదేళ్ల పాలన తర్వాత కూడా 2014కు దీటుగా సీట్లు సాధించి మళ్లీ మోడీ ప్రధాని పదవిని చేజిక్కించుకుంటుండటం అనూహ్యం. గత పర్యాయం లాగే ఈసారి కూడా భాజపానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తోంది.

ఇది కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు అస్సలు మింగుడుపడని విషయం. మోడీకి వ్యతిరేకంగా జట్టు కట్టి ఆయనపై తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేశాయి ప్రతిపక్షాలు. చంద్రబాబు దేశవ్యాప్తంగా తిరిగి ప్రతిపక్షాల్ని ఏకం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది. ఇక్కడా అక్కడా దారుణమైన ఎదురు దెబ్బలు తగిలిన నేపథ్యంలోచంద్రబాబు ఇప్పుడేం చేస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి పెద్ద ఎత్తున గొడవ చేశారు చంద్రబాబు అండ్ కో. మోడీ సర్కారు ఈవీఎంలను మ్యానుపులేట్ చేసి ఎన్నికల్లో గెలిచేందుకు కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు.

ఒకప్పుడు ఈవీఎంలకు మద్దతు పలికిన బాబే.. ఇప్పుడు తీవ్ర స్థాయిలో వాటిని వ్యతరేకించారు. ఆయనకు మిగతా ప్రతిపక్షాలు కూడా గొంతు కలిపాయి. ఇప్పుడు ఎన్నికల్లో అక్కడ మోడీ, ఇక్కడ జగన్ ఏకపక్షంగా గెలిచిన నేపథ్యంలో బాబు అండ్ కో ఈవీఎంలను మరింత పెద్ద బూచిగా చూపించే ప్రయత్నం చేయడం ఖాయం. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం వల్లే మోడీ, జగన్ గెలిచారన్న ఆరోపణ ఆయన నోటి నుంచి రావడం లాంఛనమే. ఈవీఎంలపై పోరాటం అంటూ ఆయన రంగంలోకి దిగడం కూడా ఖాయం. ఆయనకు మిగతా పార్టీల అధినేతలు కూడా జతకలుస్తారనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English