బ్రేకింగ్ న్యూస్ః సీఎం ప‌ద‌వి బాబు రాజీనామా...గ‌వ‌ర్నర్‌కు ప‌త్రాలు

బ్రేకింగ్ న్యూస్ః సీఎం ప‌ద‌వి బాబు రాజీనామా...గ‌వ‌ర్నర్‌కు ప‌త్రాలు

తుది ఫ‌లితాలు విడుద‌ల కాకముందే...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ‌లితాల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుమ్ములేపుతోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 134  స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. 25 పార్లమెంట్ స్థానాల్లో 24 సెగ్మెంట్లలో వైసీపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. గంపగుత్తగా అన్ని స్థానాలను వైసీపీ గెల్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రా ఓటర్లు సంచలన తీర్పు నేప‌థ్యంలో..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా నిర్ణ‌యం తీసుకున్నారు.

గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిని గెలిపించిన ఓటర్లు… స్వల్ప తేడాతో వైసీపీని ఓడించారు. కానీ ఈసారి ఎన్నికల్లో…వైసీపీకి బ్ర‌హ్మండ‌మైన విజ‌యం అందించినట్టుగా ట్రెండ్స్ బట్టి తెలుస్తోంది. అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ ఫలితాల్లో జగన్ పార్టీ జయకేతనం ఎగరేస్తోంది. దీంతో.. వైసీపీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి...ఎన్నికల ఫలితాలపై తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని... తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక 30వ తేదీన ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఇదిలాఉండ‌గా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం గవర్నర్ కు రాజీనామా పత్రాన్ని నారా చంద్రబాబు నాయుడు సమర్పించనున్నట్లు స‌మాచారం. హైద‌రాబాద్‌లోని రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న‌ట్లు పేర్కొంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English