ఓట‌మి దిశ‌గా ఇద్ద‌రు సీఎంల కొడుకులు...బాబు గారు ఏం చెప్తారో

ఓట‌మి దిశ‌గా ఇద్ద‌రు సీఎంల కొడుకులు...బాబు గారు ఏం చెప్తారో

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఖాతాలో...ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల త‌న‌యుల‌ను ఓడించిన అపప్ర‌ద న‌మోదు కానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్‌తో పాటుగా...క‌ర్ణాట‌క సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ సైతం ఓట‌మి దిశ‌గా సాగుతున్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 134  స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. 25 పార్లమెంట్ స్థానాల్లో 24 సెగ్మెంట్లలో వైసీపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. గంపగుత్తగా అన్ని స్థానాలను వైసీపీ గెల్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఓట‌మి ప‌రంప‌ర‌లో లోకేష్ ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తనయుడిగా ఎమ్మెల్సీ అయిపోయి, మంత్రి అయిన లోకేష్‌ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికను ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యేగా నెగ్గడం అనే విషయంలో లోకేష్ సత్తా చూపిస్తారా, లేదా అనేది చర్చనీయాంశంగా మారగా....ఆయ‌న ఓట‌మి వైపు సాగ‌డం తెలుగుదేశం పార్టీ శ్రేణుల‌ను స‌హ‌జంగానే షాక్‌కు గురి చేస్తున్నాయి. మ‌రోవైపు  మాండ్యాలో జేడీఎస్-కాంగ్రెస్ అభ్యర్థి, కుమారస్వామి కుమారుడు నిఖిల్ సైతం ఓట‌మి దిశ‌గా సాగుతున్నారు. అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న సినీ నటి సుమలత ముందంజ‌లో ఉన్నారు. ఈ ఎన్నిక‌ల్లో నిఖిల్‌ మద్దతుగా చంద్రబాబునాయుడు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా దేవెగౌడ ఫ్యామిలీపై ప్రశంసలు గుప్పించిన చంద్రబాబు..నిఖిల్‌ను మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే, తాజాగా సుమ‌ల‌త గెలుపొందే దిశ‌గా సాగుతుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇటు త‌న సొంత కుమారుడిని గెలిపించుకోలేక‌పోతున్న చంద్ర‌బాబు..అటు త‌ను ప్ర‌చారం చేసిన ముఖ్య‌మంత్రి త‌న‌యుడిని సైతం గెలిపించ‌లేర‌నే భావ‌న‌ను సైతం చంద్ర‌బాబు మూట‌గ‌ట్టుకుంటార‌ని అంటున్నారు. మ‌రోవైపు, చంద్ర‌బాబు ఇత‌ర రాష్ట్రాల్లో ప్ర‌చారం చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు ఓట‌ముల‌పై సైతం ప‌లువురు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English