లగడపాటి గారూ.. కొంచెం లైన్లోకి రండి ప్లీజ్

లగడపాటి గారూ.. కొంచెం లైన్లోకి రండి ప్లీజ్

ఎన్నికల ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చేసినట్లే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతున్నట్లే. ఆ పార్టీ గెలుపు ఊహించనిదేమీ కాదు. కానీ మరీ ఈ స్థాయి భారీ విజయం ఎవరూ ఊహించలేేదు. కనీసం వైకాపా వాళ్లు అయినా ఈ స్థాయి విజయాన్ని అంచనా వేసి ఉంటారా అంటే సందేహమే. 175 సీట్లలో 150 గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అసాధారణమైన విజయం.

వైకాపాకు ఏపీలో ఈ స్థాయి వేవ్ ఊహకందని విషయం. ఎన్నికలకు ముందు ఒపీనియన్ పోల్స్‌తో పాటు ఎన్నికల తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో కూడా వైెకాపాకే ఎక్కువమంది పట్టం కట్టారు. ఐతే ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ మాత్రం ఎగ్జిట్ పోల్స్‌లో తెలుగుదేశం పార్టీదే విజయం అన్నారు. తెలంగాణలో ప్రజలు కారులో ప్రయాణించాలనుకుంటే.. ఏపీలో జనాలు సైకిల్ ఎక్కాలని డిసైడయ్యారని అన్నారు.

తెలుగుదేశం పార్టీకి ప్లస్ ఆర్ మైనస్ 100 సీట్లు వస్తాయని లగడపాటి అంచనా వేశారు. జగన్ పార్టీకి 70కి అటు ఇటుగా స్థానాలు సాధిస్తుందని చెప్పారు. కానీ ప్రస్తుతం నంబర్స్ ఆయన అంచనాకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆరు నెలల కిందట తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని, టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పి జోకర్ అయిపోయాడు లగడపాటి. అంతకుముందు ఆయనకున్న క్రెడిబిలిటీ అప్పుడే దెబ్బ తినేసింది. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే లగడపాటి జీరో అయిపోయాడనే చెప్పాలి.

ఆయన క్రెడిబిలిటీ పూర్తిగా పోయినట్లే. ఈసారి ఎన్నికల ఫలితాలు తేడా వస్తే ఇకపై తాను సర్వేలే చేయనని లగడపాటి ప్రకటించారు. ఇప్పుడు జనాలందరూ లగడపాటి కోసమే ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా లగడపాటి సర్వే తాలూకు ప్రెస్ మీట్ కోసం కోసం జనాలు ఎలా అయితే ఎదురు చూశారో.. ఇప్పుడు ఆయన మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారో అని అంతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆయన త్వరగా ఆ తంతు ముగించేస్తే బెటర్.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English