కేఏ పాల్‌కు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా?

కేఏ పాల్‌కు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి కేఏ పాల్ చేసిన హంగామా ఎలాంటిదో తెలిసిందే. ఏపీలో అధికారంలోకి రాబోయేది తన ప్రజాశాంతి పార్టీనే అని ఆయన చాలాసార్లు ధీమాగా చెప్పారు. కొన్ని రోజుల కిందట అయితే తమ పార్టీకి 100 సీట్లు గ్యారెంటీ అని.. కానీ ట్రెండ్ కంటిన్యూ అయితే 175కు 175 సీట్లు కూడా తమ పార్టీకే సొంతం కావచ్చంటూ చేసిన ప్రకటన జనాలకు దిమ్మదిరిగిపోయేలా చేసింది.

ఈ కామెడీని జనాలు బాగానే ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఇక ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే ఏపీలో ఎక్కడా కూడా ఆ పార్టీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. ఏదైనా నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు వేలల్లో ఓట్లు వచ్చినా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది.

ఇదిలా ఉంటే నరసాపురం ఎంపీగా పోటీ చేసిన కేఏ పాల్‌కు మధ్యాహ్న సమయానికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిస్తే షాకవ్వాల్సిందే. 12 గంటల ప్రాంతంలో ఆయనకు కేవలం 80 ఓట్లు పడినట్లుగా వస్తున్న సమాచారం షాకింగే. క్రైస్తవ మత ప్రభోదకుడైన పాల్‌కు ఆ మతస్థులు అంతో ఇంతో ఓట్లు వేస్తారనే అంతా అనుకున్నారు. అలా చూసుకుంటే కొన్ని వేలల్లో ఓట్లు పడతాయని అంచనా వేశారు. కానీ కనీసం వంద ఓట్లు కూడా రాని పరిస్థితి అంటే మరీ దారుణం. జనాలు పాల్‌ను ఎలా చూస్తున్నారో.. ఆయన ఏ స్థాయిలో కామెడీ పీస్ అయిపోయారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

వైఎస్సార్ కాంగ్రెస్‌కు క్రైస్తవుల్లో ఉన్న బలమైన ఓటు బ్యాంకును పాల్ పార్టీ ఎంతో కొంత దెబ్బ తీస్తుందని తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది. చాలాచోట్ల వైకాపా అభ్యర్థుల్ని పోలిన పేర్లతో అభ్యర్థుల్ని నిలబెట్టాడు పాల్. వైకాపా గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉండే హెలికాఫ్టర్ గుర్తు ప్రజాశాంతి పార్టీకి ఉండటంతో జగన్‌ పార్టికి దెబ్బ పడుతుందని అనుకున్నారు. కానీ ఆ అంచనాలేమీ ఫలించలేదని ఫలితాల్ని బట్టి అర్థమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English