మూడో స్థానానికి పడిపోయిన పవన్ కళ్యాణ్

మూడో స్థానానికి పడిపోయిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పరాభవం తప్పేలా లేదు. ఒకటికి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. ఒక చోట మాత్రం ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. భీమవరంలో ఆరంభం నుంచి వెనుకబడి ఉన్న పవన్.. అసలు రెండో స్థానం కూడా సాధించే పరిస్థితి కనిపించడం లేదు. మొదట్లో వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌కు గట్టి పోటీ ఇచ్చిన పవన్.. ఒక దశ దాటాక మూడో స్థానానికి పడిపోయాడు.

గాజువాకలో అయినా పవన్ గెలుస్తాడా లేదా అన్నది సందేహంగానే ఉంది. ఉదయం పదిన్నర ప్రాంతంలో పవన్ గాజువాకలోనూ వెనుకబడే ఉన్నారు. ఆ సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా మూడు స్థానానాల్లో మాత్రమే పవన్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీ అగ్ర నేత నాదెండ్ల మనోహర్ తెనాలిలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాజోలులోనూ జనసేన అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

భీమవరంలో పవన్‌కు పరాభవం తప్పదని తేలిపోయినట్లే. గాజువాక సంగతే తేలాల్సి ఉంది. భీమవరంపై మొదటి నుంచి ఆశలు తక్కువే కానీ.. గాజువాకలో విజయం మీద మాత్రం పవన్ అండ్ కో చాలా ధీమాగా ఉండేది. కానీ ఫలితాలు చూస్తే పూర్తి నిరాశాజనకంగా కనిపిస్తున్నాయి. ఐతే పవన్ పార్టీకి ఓటు షేర్ పర్వాలేదనే చెప్పాలి. అటు ఇటుగా 7 శాతం దాకా ఓట్ షేర్ ఆ పార్టీకి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే 10 శాతానికి పైగా ఓటు షేర్, ఓ పది సీట్లు గెలిస్తే జనసేనకు చాలా ఉత్సాహంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే 5 సీట్లు రావడం కూడా కష్టంగా ఉంది. కనీసం పవన్ కళ్యాణ్ అయినా ఒక చోట గెలవకపోతే ఆ పార్టీ నీరుగారిపోవడం ఖాయం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English