శంకరన్న జులై ‘జోస్యం’

శంకరన్న జులై ‘జోస్యం’

మాజీ మంత్రి శంకరరావు జోస్యాలు చెప్పడంలో దిట్ట. జోస్యమైతే చెప్పడం ఆయనకు అలవాటుగాని, అవి నిజమవ్వాలని రూలు లేదు కదా. రాజకీయాల్లో జోస్యాలు పటా పంచలైపోయే సందర్భాలే ఎక్కువ ఉంటాయి. శంకరన్న గారి జోస్యం కూడా అంతే. ముఖ్యమంత్రిని మార్చుతారని ఏడాది నుంచి శంకరన్న జోస్యం చెప్పడమే తప్ప, ఆయన జోస్యం ఫలించడంలేదు. చెప్పిన జోస్యం ఫలించకపోయినంతమాత్రాన జోస్యం చెప్పడం మానేయరు కదా. శంకరన్న కూడా అలానే జోస్యం చెప్పడం మానడంలేదు.

జులైలో సంచలన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు శంకరన్న. సంచలన నిర్ణయాలు కాంగ్రెసు అధిష్టానం తీసుకుంటుందట. ఇప్పటికే ఇద్దరు మంత్రులతో రాజీనామాలు చేయించిన కాంగ్రెసు అధిష్టానం సంచలన నిర్ణయాలు తీసుకోవడమంటే ఏంటో కూడా శంకరన్న చెబితే బాగుండేది. రెండు నెలల్లో ఏదో ఒకటి జరగచ్చన్న ఆయన ఆశ, అలా ఆయనతో జోస్యాలు చెప్పిస్తుందని అనుకోవాల్సి ఉంటుంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు