బెట్టింగ్‌ల జోరు...తెలంగాణ కంటే ఏపీయే హాట్‌

బెట్టింగ్‌ల జోరు...తెలంగాణ కంటే ఏపీయే హాట్‌

ఎగ్జిట్ పోల్స్ విడుదలై...రిజల్ట్స్ డేట్ దగ్గర పడటంతో పందేల జోరు పీక్‌ స్టేజ్కు చేరింది. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య‌మైన న‌గ‌రాల్లో ఎక్క‌డ చూసినా ఎన్నికల బెట్టింగ్ బేరం జోరుగా నడుస్తోంది. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయి. భవనాలు, బంగారం, పొలాలు, స్థలాలు కూడా పందేనికి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లోక్సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో తెలంగాణ కంటే... కంటే పందెం రాయుళ్లు ఫుల్ ఫోకస్ ఏపీపై పెట్టారు. సోషల్‌ మీడియాలో రహస్యంగా గ్రూపులు ఏర్పాటు చేసి బెట్టింగ్‌లు కడుతున్నట్లు తెలుస్తోంది. కొంద‌రు పారిశ్రామిక వేత్తలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు బుకీల అవతారం ఎత్తి బెట్టింగ్‌లు కాస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ కంటే ఎక్కువ ఉత్కంఠ‌ను క‌లిగి ఉన్న ఏపీలో ఎగ్జిట్‌‌ పోల్స్‌‌ వెలువడటంతో బెట్టింగ్‌‌లు మరింత ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరుతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా బెట్టింగ్‌‌ కడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ పోటీ చేసిన మంగళగిరి స్థానం, జనసేన అధినేత పవన్‌‌ కల్యాణ్‌‌ పోటీ చేసిన రెండు సీట్లు, నాగబాబు పోటీ చేస్తున్న నరసాపురం, బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం, రోజా బరిలో ఉన్న నగరిపై బెట్టింగ్‌‌లు ఎక్కువగా కడుతున్నారు. వైఎస్ జగన్‌‌, చంద్రబాబు మెజారిటీపైనా పందేలు కాస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ బెట్టింగ్లు భారీగా నడుస్తున్నాయి.

ఇక తెలంగాణ‌లో, బెట్టింగ్ రాయుళ్ల దృష్టి సీఎం కేసీఆర్ కూతురు, సీట్టింగ్ ఎంపీ కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్‌‌ సెగ్మెంట్పైనే ఉన్నట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లోని జూదరులు ఈ స్థానంపై బెట్టింగ్‌‌ కాస్తున్నారు. ఉత్తమ్‌‌ పోటీ చేస్తున్న నల్గొండ, డీకే అరుణ బరిలో ఉన్న మహబూబ్‌‌నగర్‌‌, రేవంత్‌‌రెడ్డి పోటీ చేస్తున్న మల్కాజ్‌‌గిరి, కిషన్‌‌ రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్‌‌, కొండా విశ్వేశర్‌‌రెడ్డి పోటీ చేస్తున్న చేవెళ్లపై బెట్టింగ్‌‌లు ఎక్కువగా నడుస్తున్నాయి. అత్యధిక మెజారిటీకి సంబంధించి మెదక్‌‌, హైదరాబాద్‌‌, వరంగల్‌‌ స్థానాలపై పందేలు కడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్‌‌ కేంద్రంగా రాజకీయ బెట్టింగ్‌‌లు సాగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఖమ్మం, మహబూబ్‌‌నగర్‌‌, సూర్యాపేట, మెదక్‌‌, కరీంనగర్‌‌, నల్గొండ, వరంగల్‌‌, మహబూబ్‌‌నగర్‌‌, ఆదిలాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కూడా పందేలు జోరుగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English