చాణ‌క్య చెప్పిందంటే కాస్త ఆలోచించాల్సిందే!

చాణ‌క్య చెప్పిందంటే కాస్త ఆలోచించాల్సిందే!

తెలుగులో బోలెడ‌న్ని మీడియా సంస్థ‌లు ఉన్నా.. ఏ సంస్థ కూడా ఎగ్జిట్ పోల్స్ లాంటి వాటిని సంస్థ త‌ర‌ఫున ప్ర‌క‌టించే ధోర‌ణి లేద‌ని చెప్పాలి. నిజానికి ఎగ్జిట్ పోల్స్ ను ప్ర‌క‌టించ‌టం అంటే.. దానికి భారీ ఎత్తున మంత్రాంగంతో పాటు.. దాని కోసం ప‌ని చేసే వారు నైఫుణ్య‌వంతులై ఉండాలి. ఎగ్జిట్ పోల్స్ ను అంచ‌నా వేయ‌టంలో ఏ మాత్రం త‌ప్పినా.. స‌ద‌రు మీడియా సంస్థ‌కున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేసిన‌ట్లు అవుతుంది.

అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఏ మీడియా సంస్థ కూడా తాము ఎగ్జిట్ పోల్స్ నిర్వ‌హించామ‌ని.. దాని ఫ‌లితాలు ఈ రీతిలో ఉన్నాయంటూ ప్ర‌చారం చేసుకోవ‌టం క‌నిపించ‌దు. అప్పుడ‌ప్పుడు కొన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్లు ఫ‌లితాల్ని  ప్ర‌క‌టించ‌టం క‌నిపిస్తోంది. అయినా.. అవేమీ పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా విడుద‌ల చేసిన ఎగ్జిట్ పోల్ స‌ర్వే ఫ‌లితాల్లో ప‌లు సంస్థ‌లు పెద్ద ఎత్తున త‌మ స‌ర్వే ఫ‌లితాల్ని వెల్ల‌డించారు.

మిగిలిన వాటి సంగ‌తి ఎలా ఉన్నా.. ఉత్త‌రాదిలో జ‌రిగే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ను ప‌లు సంస్థ‌లు చేప‌ట్టినా.. టుడేస్ చాణ‌క్య వెల్ల‌డించే ఫ‌లితాల మీద ఒకింత ఆస‌క్తి ఎక్కువ‌. ఎందుకంటే మిగిలిన వారి మాదిరి కాకుండా చాణ‌క్య స‌ర్వే చెప్పిన అంచ‌నాలు నిజం కావ‌టంతో.. ఆ సంస్థ విడుద‌ల చేసే ఎగ్జిట్ పోల్స్ నిజం అయ్యే ఛాన్సులు కనిపిస్తాయి.

ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ... లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు  సంబంధించి ప‌లు మీడియా సంస్థ‌లు త‌మ ఎగ్జిట్ పోల్స్ ప్ర‌క‌టించినా.. ఏపీకి సంబంధించి చాణ‌క్య వెల్ల‌డించిన సీట్లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. ప‌లువురు టీడీపీ గెలుస్తుంద‌న్న మాట చెబితే.. అందుకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఉండ‌టం ఒక ఎత్తు అయితే.. తాజాగా చాణ‌క్య వెల్ల‌డించిన స‌ర్వే రిపోర్ట్  బాబుకు మెజార్టీ సీట్లు ఖాయ‌మ‌న్న మాట‌ను చెప్పింది.

దీంతో.. ప‌లు మీడియా సంస్థ‌లు ఎన్ని వాద‌న‌లు వినిపించినా.. చాణ‌క్య నోటి నుంచి ఫ‌లితాల‌కు సంబంధించి వెలువ‌డే అంచ‌నాలు దాదాపుగా స‌క్సెస్ అయ్యే అవ‌కాశం ఉందన్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది. చాణ‌క్య అంచ‌నా ప్ర‌కారం ఎంపీ ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ 14-20 సీట్లు సొంతం చేసుకుంటుంద‌ని పేర్కొంది.
అదే స‌మ‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు 5-11 మంది ఎంపీ అభ్య‌ర్థులు గెలిచే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాను వెల్ల‌డించారు. ఇందులో నిజం ఎంత‌?  అన్న‌ది లెక్క తేలాలంటే.. ఏప్రిల్ 23 వ‌ర‌కు వెయిట్ చేయక త‌ప్ప‌నిస‌రి. బాబుకు సానుకూలంగా చెప్పిన అంచ‌నాలు.. రానున్న రోజుల్లో చాణ‌క్య ఇమేజ్ ను ఎంత‌గా మారుస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English