లగడపాటి పక్కన నూతన్ నాయుడు... మ్యాటరేంటో?

లగడపాటి పక్కన నూతన్ నాయుడు... మ్యాటరేంటో?

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు సంబందించి ఆదివారం సాయంత్రం ఆంద్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన బెజవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశారు. తిరుమల వెంకన్న పాదాల చెంత తిరుపతి వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో లగడపాటి తన ఆర్జీ ఫ్లాష్ టీం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించారు.

ఎగ్జిట్ పోల్స్ మాటను లగడపాటి ఎప్పుడో చెప్పేశారు కదా... ఈ నేపథ్యంలో గెలిచే టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయం తప్పించి జనాల్లో దీనిపై పెద్దగా ఆసక్తి లేదనే చెప్పాలి. అయితే ఈ ఎగ్జిట్ ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లగడపాటి పక్కన కూర్చున్న వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ వ్యక్తి మరెవరో కాదు... బిగ్ బాస్ సీజన్ 2లో ఓ రేంజిలో పాపులారిటీని సంపాదించిన నూతన్ నాయుడు.

అసలు నూతన్ నాయుడిని లగడపాటి ఎందుకు తన పక్కన కూర్చోబెట్టుకున్నారా? అంటూ అందరూ ఆరా తీశారు. లగడపాటి ఆర్జీ ఫ్లాష్ టీంలో నూతన్ నాయుడు ఏమైనా కీలక భూమిక పోషించారా? అన్న దిశగానూ ఆసక్తికర విశ్లేషణలు సాగాయి. అయితే లగడపాటికి  నూతన్ నాయుడికి ఎలాంటి సంబంధం లేదని ఆ తర్వాత తేలిపోయింది. అసలు ఈ ఎగ్జిట్ ఫలితాలు, ఆర్జీ ఫ్లాష్ టీంతో కూడా నూతన్ నాయుడికి సంబంధం లేదట. ఏదో అలా అతడు తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే.. అప్పుడే మీడియా సమావేశానికి వెళుతున్న లగడపాటి అతడిని పిలిచి... తనతో పాటే మీడియా మీట్ కు తీసుకెళ్లి అలా పక్కన కూర్చోబెట్టుకున్నారట. ఈ విషయాన్ని నూతన్ నాయుడే స్వయంగా వెల్లడించారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English