ల‌గ‌డ‌పాటి ఫ్లాష్ టీం స‌ర్వే లెక్క తేలింది..ఆ పార్టీదే ఏపీలో అధికారం

ల‌గ‌డ‌పాటి ఫ్లాష్ టీం స‌ర్వే లెక్క తేలింది..ఆ పార్టీదే ఏపీలో అధికారం

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు వెల్లడించడానికి మరో 24 గంటల సమయం ఉన్నా..ఫలితాలపై ఆచితూచి వ్యాఖ్యానిస్తూనే ఏపీ, తెలంగాణ, కేంద్రంలో ఏపార్టీలకు మెజార్టీ వస్తుందో ఒక‌రోజు ముందుగానే చెప్పకనే చెప్పిన ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ తాజాగా త‌నఫ్లాష్ టీం స‌ర్వే వివ‌రాల‌ను విడుద‌ల చేశారు. ఆదివారం తిరుప‌తిలో త‌న స‌ర్వే వివ‌రాల‌ను వెల్ల‌డిస్తాన‌ని ప్ర‌క‌టించిన ల‌గ‌డ‌పాటి ఈ మేర‌కు స్ప‌ష్ట‌త ఇచ్చారు. తాజా ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకే ఓటు వేశార‌ని స‌ర్వే ముఖంగా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున ‘సైకిల్‌’పైన ప్రయాణం చెయ్యాలని నిర్ణయించుకున్నారని నర్మగర్భంగా ఎన్నికల ఫలితాలను వెల్లడించిన ల‌గ‌డ‌పాటి...తాజాగా త‌న స‌ర్వే ఫ‌లితాల్లోనూ అదే విష‌యం సూచించారు. తెలుగుదేశం పార్టీకి మ‌హిళ‌లు అండ‌గా నిల‌వ‌గా...వైసీపీకి పురుషులు ఎక్కువ‌గా ఓట్లేశార‌ని పేర్కొన్నారు. యువ‌త ఎక్కువ‌గా జ‌న‌సేన వైపు మొగ్గు చూపింద‌న్నారు. ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఓటు బ్యాంక్ న‌మోదు కాలేద‌ని, మ‌రోవైపు కొంద‌రు ఎమ్మెల్యేల‌పై స్ప‌ష్ట‌మైన వ్య‌తిరేక‌త ఉంద‌న్నారు. ఓటు వేసిన త‌ర్వాత బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన వారు వైసీపీకి అంండ‌గా ఉండ‌గా...సైలెంట్ ఓటు టీడీపీ వైపు ప‌డింద‌ని పేర్కొన్నారు.

ల‌గ‌డ‌పాటి పేర్కొన్న సీట్ల లెక్క ఇదే

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు
తెలుగుదేశం పార్టీ - 100+- 10
వైసీపీ- 72+- 07
ఇత‌రులు- 03++-02

పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు
టీడీపీ--15+-02
వైసీపీ ---10+-02
ఇత‌రులు 0 నుంచి ఒక‌టి

వివిధ పార్టీల ఓటింగ్ శాతం
టీడీపీ -- 43 నుంచి 45%
వైసీపీ -- 40 నుంచి 42%జ‌న‌సేన - 10 నుంచి12 %

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English