సౌత్ సత్తా!... ఉత్త‌రాది చూపంతా ఇటువైపే!

సౌత్ సత్తా!... ఉత్త‌రాది చూపంతా ఇటువైపే!

జాతీయ రాజ‌కీయాల స్టైల్ మారిపోయింది. ఇప్ప‌టిదాకా ఉత్త‌రాది గాలి ఎటు వీస్తే... కేంద్రంలో ఆ పార్టీదే అధికారంగా వ్య‌వ‌హారం న‌డిచింది. అయితే ఇప్పుడ‌లా కాదు. ద‌క్షిణాది ఎటు వైపు మొగ్గితే... వారిదే అధికారం అన్న రీతిగా ప‌రిస్థితి మారిపోయింది. గ‌డ‌చిన ఎన్నిల్లో కూడా ఈ త‌ర‌హా ప‌రిస్థితి లేద‌నే చెప్పాలి. ఈ సారి ఉన్న‌ప‌ళంగా ప‌రిస్థితి అంతా మారిపోయింది. ద‌క్షిణాదిపై జాతీయ పార్టీల‌కు పెద్ద‌గా ప‌ట్టు లేద‌నే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, టీఆర్ఎస్‌, వైసీపీ... త‌మిళ‌నాట డీఎంకే, అన్నాడీఎంకే... క‌ర్ణాట‌క‌లో జేడీఎస్‌, కేర‌ళ‌లో లెఫ్ట్ ఫ్రంట్... ఇలా ద‌క్షిణాది అంత‌టా ప్రాంతీయ పార్టీలే హ‌వా.

ఒక్క క‌ర్ణాట‌క మిన‌హా బీజేపీ ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క చోట కూడా పెద్ద‌గా ప‌ట్టు సాధించ‌లేద‌నే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తెలుగు నేల‌పై ఒక‌ప్పుడు బాగానే ఉన్నా... ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. అదే స‌మ‌యంలో అప్ప‌టికే జాతీయ రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి చేరుకున్న టీడీపీకి తోడుగా టీఆర్ఎస్‌, వైసీపీలు కూడా త‌మ‌దైన రీతిలో బ‌లోపేత‌మ‌య్యాయి. ఇక త‌మిళ‌నాడు ప‌రిస్థితి చెప్పాల్సిన ప‌నే లేదు. కేర‌ళ‌లో కూడా ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీకి కూడా కాలు మోపే అవ‌కాశం ఇప్ప‌టిదాకా ద‌క్క‌లేద‌నే చెప్పాలి. అదే స‌మ‌యంలో ఉత్త‌రాదిలో స్ప‌ష్ట‌మైన మెజారిటీ సాధించే అవ‌కాశాలు ఉన్న నేప‌థ్యంలో ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీ కూడా ద‌క్షిణాది వైపు దృష్టి సారించ‌లేద‌నే చెప్పాలి.

అయితే ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉత్త‌రాదిలో చెరి స‌గం సీట్లు పంచుకునే స్థితికి కాంగ్రెస్‌, బీజేపీలు చేర‌డంతో ద‌క్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు సాధించే సీట్టే కేంద్రంలో అధికారాన్ని శాసించ‌నున్నాయి. నేరుగా ద‌క్షిణాదికి చెందిన నేత‌ల‌కు ప్ర‌ధాని అవ‌కాశం ద‌క్క‌కున్నా... ఇప్పుడు ద‌క్షిణాదిలోని ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు లేకుండా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవ‌కాశాలే క‌నిపించ‌డం లేదు మొత్తంగా ఇప్పుడు ద‌క్షిణాది పార్టీల మ‌ద్ద‌తు ఉత్త‌రాది పార్టీలుగా ముద్ర ప‌డిన జాతీయ  పార్టీల‌కు కావాల్సి వ‌చ్చింద‌ని చెప్పాలి. ఇదే పంథా మున్ముందు కూడా కొన‌సాగడం కూడా ఖాయంగానే క‌నిపిస్తోంది. మొత్తంగా ఇప్ప‌టిదాకా జాతీయ రాజ‌కీయాల‌ను ఉత్త‌రాది భార‌తం శాసిస్తే.. ఇక‌పై ద‌క్షిణాది భారతం దేశ రాజ‌కీయాల్లో కీల‌క భూమిక పోషించ‌నుంద‌న్న మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English