సాయం అడిగితే.. 29న ర‌మ్మ‌న‌టం ఏమిటి జ‌గ‌న్‌?

 సాయం అడిగితే.. 29న ర‌మ్మ‌న‌టం ఏమిటి జ‌గ‌న్‌?

ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని జోరుగా చేస్తున్న కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్రియాంక గాంధీని ఈ మ‌ధ్య‌న ఒక పేద మ‌హిళ వ‌చ్చి.. త‌న బిడ్డ‌కు వైద్య సాయం కావాల‌ని కోరింది. వెంట‌నే స్పందించిన ప్రియాంక‌గాంధీ.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల్ని పిలిచి.. అర్జెంట్ గా ఆ పాప‌ను ఢిల్లీకి తీసుకెళ్లి ఆసుప‌త్రిలో చేర్పించాల‌ని చెప్ప‌ట‌మే కాదు.. హెలికాఫ్ట‌ర్ లో ఆమెను తీసుకెళ్లాల‌ని ఆదేశించారు. ఇందుకోసం ఇద్ద‌రు సీనియ‌ర్ పార్టీ నేత‌ల్ని వారి వెంట పంపారు. తానీ  విష‌యాన్ని వ్య‌క్తిగ‌తంగా స‌మీక్షిస్తాన‌ని.. త‌న‌కు స‌మాచారం ఇవ్వాల‌ని కోరారు.

క‌ట్ చేస్తే.. కాస్త గ్యాప్ త‌ర్వాత‌.. ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత పులివెందుల‌కు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు తాజాగా ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హిస్తున్నారు. ఎప్ప‌టిలానే మ‌నంద‌రికి మంచిరోజులు రాబోతున్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. ప్ర‌జ‌ల దీవెన‌లే శ్రీ‌రామ‌ర‌క్ష‌గా ఉన్నాయ‌న్నారు. జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న ప్ర‌జాద‌ర్బార్ కు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు పోటెత్తారు. వారి వ్యక్తిగ‌త స‌మ‌స్య‌ల్ని చెప్పుకున్నారు.

ప్ర‌తి ఒక్క‌రికి సాయం చేస్తాన‌ని.. కాస్త టైమివ్వాల‌ని ఆయ‌న కోరారు. ఇదిలా ఉంటే.. ఒక త‌ల్లి త‌న బిడ్డ‌కు అనారోగ్యంగా ఉంద‌ని.. వైద్యం చేయించాల‌ని కోరారు. దీనికి స్పందించిన‌జ‌గ‌న్ .. ఈ నెల 29.. 30ల‌లో ఒక‌సారి త‌న‌ను క‌ల‌వాల‌ని.. వైద్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాన‌ని కోరారు. ఇల్లు కావాలి.. ఫించ‌న్ కావాలి.. రుణ‌సాయం కావాలి.. ప‌ట్టాదారు పాసుపుస్త‌కం కావాల‌ని అడిగే వారికి వాయిదా వేయ‌టంలో అర్థం ఉంది. కానీ.. త‌క్ష‌ణం అందాల్సిన వైద్య సాయం కోసం ఇంటికి వ‌చ్చి అడిగిన వారికి.. దాదాపు రెండు వారాల‌కుపైనే ఆగాల‌ని చెప్ప‌టంలో అర్థ‌మేమిటో జ‌గ‌న్ మాత్ర‌మే చెప్పాలి.

ప‌వ‌ర్ చేతికి వ‌చ్చిన‌త‌ర్వాత‌..జ‌గ‌న్ ను క‌ల‌వ‌టం సామాన్యుల‌కు సాధ్య‌మ‌వుతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. వాస్త‌వానికి ఆయ‌న‌కున్న అనుచ‌ర గ‌ణానికి.. ఇలాంటి వైద్య‌సాయం కేసుల్ని రిఫ‌ర్ చేసి వెంట‌నే సాయం అందేలా చేస్తుంటారు. కానీ.. అందుకు భిన్నంగా రెండు వారాలు ఆగిన త‌ర్వాత త‌న‌ను క‌ల‌వాల‌ని చెప్పిన జ‌గ‌న్ తీరు అవాక్కు అయ్యేలా చేయ‌ట‌మే కాదు.. సాయానికి ఇన్నిసార్లు తిర‌గాలంటే ఎలా జ‌గ‌న్‌? అన్న క్వ‌శ్చ‌న్ రాక మాన‌దు. అయినా.. ఈ 29.. 30 లెక్కేంటి జ‌గ‌న్ బాబు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English