ఏపీలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఈసీ దొరికిపోయిన‌ట్లేగా

ఏపీలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఈసీ దొరికిపోయిన‌ట్లేగా

ఏపీలో వివిధ నిర్ణ‌యాల‌తో వివాదాస్పదం అవుతున్న ఎన్నిక‌ల క‌మిష‌న్ మ‌ళ్లీ అదే త‌ర‌హాలో వివాదాస్ప‌ద చ‌ర్య‌కు ఓకే చెప్పిందంటున్నారు. ఒకే స‌మ‌స్య‌, ఒకే ప్ర‌తిపాదన అయిన‌ప్ప‌టికీ, తెలుగుదేశం పార్టీ ప్ర‌తిపాద‌న‌కు ఒక రీతిలో, ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన‌తికి మ‌రో రీతిలో స్పందించ‌డం ప‌ట్ల ఈ అనుమానాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో రీపోలింగ్ నిర్ణ‌యంపై ప‌లు వ‌ర్గాలు ఈ సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి.

వైసీపీ ఫిర్యాదు మేరకు చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఆదేశించటంతో ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి మరోసారి బహిర్గతమైందని టీడీపీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రగిరి నియోజకర్గంతో సహా మరి కొన్ని చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాల‌ని టీడీపీ ముందుగానే ఈసీని కోరినప్పటికి ఈసీ పట్టించుకోలేదని పార్టీ నేత‌లు అంటున్నారు. కానీ వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిన వెంటనే చంద్రగిరిలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశాలిచ్చిందని పేర్కొంటున్నారు. ఎన్నికలు జరిగిన 25 రోజుల తర్వాత ఇచ్చిన పిర్యాదు మేరకు ఈసీ ఎలా రీపోలింగ్‌ నిర్వహిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈసీ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోందనేది స్ప‌ష్ట‌మ‌వుతోందంటున్నారు.

టీడీపీ ఫిర్యాదులు పట్టించుకోవడానికి సమయంలేని ఈసీకి బీజేపీ, వైసీపీల ఫిర్యాదులపై పరుగు పరుగున స్పందించటం శోచనీయమని పార్టీ నేత‌లు మండిప‌డుతున్నారు. బీజేపీ, వైసీపీల‌ అడుగులకు మడుగులొత్తుతు ఎన్నికల సంఘం అధికారులు వ్యవహరించటం అత్యంత బాధాకరమని పార్టీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి చ‌ర్య‌లు ఈసీ విశ్వ‌స‌నీయ‌త‌ను స‌హ‌జంగానే దెబ్బ‌తీస్తాయ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English