సిక్కు తలపాగా ఉందని బార్‌లోకి రానివ్వ‌లేదు

సిక్కు తలపాగా ఉందని బార్‌లోకి రానివ్వ‌లేదు

అగ్ర‌రాజ్యం అమెరికాలో ఓ సిక్కు వ్యక్తికి తీవ్ర అవమానం జరిగింది. సిక్కులు ధరించే సంప్రదాయ తలపాగాను ధరించినందుకు అతడిని రెస్టారెంట్‌లోనికి అనుమతించలేదు. అమెరికాలోని స్టోని బ్రూక్‌ యూనివర్సిటీలో చదువుతున్న గుర్వీందర్‌ గ్రీవల్‌ శనివారం రాత్రి తన స్నేహితులను కలువడానికి న్యూయార్క్‌లోని పోర్ట్‌ జెఫర్‌సన్‌లో ఉన్న హార్బర్‌ గ్రిల్‌ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు గుర్వీందర్‌ను రెస్టారెంట్‌లోపలికి వెళ్లనివ్వక‌పోవ‌డం వివాదానికి దారితీసింది. దీంతో ఆయ‌న మీడియాను ఆశ్ర‌యించారు.

గుర్వింద‌ర్ రెస్టారెంట్‌లోకి వెళ్లిన స‌మ‌యంలో అనుమతించక‌పోవ‌డంతో త‌న‌ను ఎందుకు అడ్డుకున్నార‌ని ప్రశ్నించగా తలపాగా ఉన్నవారిని లోపలికి వెళ్లనివ్వవద్దన్న నిబంధన ఉన్నదని చెప్పాడు. వెంటనే గుర్వీందర్‌ రెస్టారెంట్‌ మేనేజర్‌ వద్దకు వెళ్లి తలపాగా ధరించడం తమ సంప్రదాయమని, లోపలికి అనుమతించాలని కోరాడు. దీనికి స్పందించిన ఆయన శుక్ర, శనివారాల్లో రాత్రి 10 గంటల తర్వాత ఎవరైనా సరే ఎలాంటి తలపాగాలు ధరించినా లోపలికి అనుమతించకూడదన్న నిబంధన ఉందని సమాధానమిచ్చారు. ప్రజల భద్రత దృష్యా ఈ నిబంధనను అమలు చేస్తున్నామని తెలిపారు.

ఈ ఘటనపై గుర్వీందర్‌ మాట్లాడుతూ ‘తలపాగా ధరించానన్న కారణంతో నన్ను రెస్టారెంట్ లోనికి అనుమతించకపోవడం దారుణం. చాలా బాధపడ్డాను. ఈ ఘటనపై పోర్ట్‌ జెఫర్‌సన్‌ మేయర్‌ నాకు క్షమాపణలు చెప్పారు. రెస్టారెంట్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు’ అని వెల్ల‌డించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English