వైకాపా గోడు పట్టలేదెవరికీ

వైకాపా గోడు పట్టలేదెవరికీ

వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ తమ అధినేత వైఎస్‌ జగన్‌ను అక్రమంగా జైలులో నిర్బంధించారని ఆరోపిస్తూ ఆందోళనలు చేపట్టింది. జగన్‌ అరెస్టయి సంవత్సర కాలం పూర్తి కావడంతో తమ అధినేతకు మద్దతుగా రాష్ట్రమంతటా ఆందోళనలు, ర్యాలీలతోపాటుగా, ఒక్కరోజు దీక్షలనూ చేశారు ఆ పార్టీ నేతలు.

కొవ్వొత్తులను వెలిగించడం, కాంగ్రెసు పార్టీని విమర్శించడం, తెలుగుదేశం పార్టీపై దుమ్మెత్తి పోయడం లాంటివి చేసిన వైకాపా నాయకులు, తమ మీడియా ద్వారా తమ కార్యక్రమాలకు ప్రచారమూ బాగానే చేసుకున్నారు. కాని అదే సమయంలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరగడంతో, రాష్ట్ర రాజకీయాలు మహానాడుపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. జగన్‌ మీడియాలో తప్ప ఇంకెక్కడా అంత ఎక్కువగా వైకాపా కార్యక్రమాలు కనిపించలేదు. హైదరాబాదులో వైకాపా గౌరవ అధ్యక్షురాలు చేపట్టిన దీక్షకు స్పందన లేకపోవడంతో ఆ పార్టీ ఆందోళన చెందుతున్నదంట.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు