ప‌ట్టువ‌ద‌లని బాబు...మ‌ళ్లీ ఢిల్లీకి ప‌య‌నం

ప‌ట్టువ‌ద‌లని బాబు...మ‌ళ్లీ ఢిల్లీకి ప‌య‌నం

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ వివాదం ముదురుతోంది. ఈనెల 19 తేదీన ఆదివారం ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఏర్పాట్లు చేసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించింది. పోలింగ్ ముగిసిన 34 రోజుల తర్వాత రీపోలింగ్ జరపడంపై ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప‌ట్ల వైసీపీ ఎత్తుగ‌డ‌ల‌ను బ‌య‌ట‌పెట్టేందుకు ఈ ప‌ర్య‌ట‌న ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని తెలుస్తోంది.

చంద్ర‌గిరిలో పోలింగ్ వెనుక వైసీపీ లెక్క‌లు వేరేన‌ని తెలుస్తోంది. అత్యల్ప మెజారిటీతో గత ఎన్నికల్లో గెలిచినందున ఈసారి ఓటమి తప్పదని వైసీపీ నేతలు భయపడుతున్నారని, అందువల్ల టీడీపీకి బలమున్న చోట్ల రీపోలింగ్‌ జరిపిస్తే పదీ ఇరవై ఓట్లతోనైనా గట్టున పడకపోమా అన్న ఆలోచనతోనే రీపోలింగ్‌కు ప్రయత్నించి సఫలమయ్యారని భావిస్తున్నారు. టీడీపీకి గట్టి పట్టున్న పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరిపించడం ద్వారా టీడీపీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలనే వ్యూహంతోనే వైసీపీ నేతలు రీపోలింగ్‌ ప్రయత్నాలకు దిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు రీపోలింగ్‌కు డిమాండ్‌ చేస్తూ ఫిర్యాదు చేశారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నారు.

ఈ నేప‌థ్యంలో  ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన కలవనున్నారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఐదు బూతుల్లో రీపోలింగ్ నిర్వహించడంపై ఎన్నికల సంఘం వద్ద తన అభ్యంతరాన్ని తెలపనున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. బీజేపీయేతర రాజకీయ పార్టీల నేతలతో చంద్రబాబు సమావేశం అవుతారు. రాహుల్‌ గాంధీ, శరద్‌ పవార్‌, శరద్‌యాదవ్‌, ఫరూక్‌ అబ్దుల్లా సహా పలువురు నేతలను ఆయన కలవనున్నారు. అక్కడి నుంచి లక్నో వెళ్లి మాయావతితో భేటీ అయ్యే అవకాశం ఉంది. 23న ఫలితాల తర్వాత కార్యాచరణపై చర్చ జరగనుంది. రేపు కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English