బాబు కింగ్ మేక‌ర్ కాలేడు..కేసీఆర్ రెండు వికెట్లు ఔట్‌

బాబు కింగ్ మేక‌ర్ కాలేడు..కేసీఆర్ రెండు వికెట్లు ఔట్‌

కేంద్రంలో ఏ పార్టీ సొంతంగా సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేద‌ని వివిధ స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్న నేప‌థ్యం ఓ వైపు, ప్రాంతీయ పార్టీల పేరుతో స‌త్తా చాటేందుకు ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌మ స‌త్తాను చాటుకునే ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తుండ‌టం మ‌రోవైపు సాగుతున్నాయి. జాతీయ పార్టీలు సైతం ఈ రెండు పార్టీల‌ను లెక్క‌లోకి తీసుకొని ముందుకు సాగుతున్నాయి. అయితే, ఈ ఎపిసోడ్‌పై  తాజాగా కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు ద‌త్తాత్రేయ స్పందించారు.

మే 23 వ తేదీన యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ యూపీఏ భాగ‌స్వామ్య పార్టీలను మరియు ప్రతిపక్ష పార్టీలను సమైక్యపర్చి నరేంద్రమోదీని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోవడానికి సమావేశం నిర్వహిస్తున్నారని ద‌త్తాత్రేయ ఆరోపించారు. ఎన్నికల ముందు ఉత్తర్‌ప్రదేశ్ లో, ఆంధ్రప్రదేశ్‌లో, కేరళలో మరియు పశ్చిమ బెంగాళ్ రాష్ట్రాలలో కలిసి పోటీ చేయని పార్టీలు ఇప్పుడు కలుస్తారనేది సందేఃగా ఉంద‌న్నారు. ఈ నెల 19 వ తేదీన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయని అయినా...ప్రతిపక్షాలు మరియు ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం ఎందుకు ఇంత తహతహలాడుతున్నాయని ప్ర‌శ్నించారు. ఆ పార్టీల తీరు 'ఆలూలేదు చూలూలేదు కొడుకు పేరు సోమలింగం' అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

కేంద్రంలో హంగ్ వస్తుందని, తాము నిర్ణయాత్మక శక్తిగా నిలుస్తామ‌ని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పర్యటనలు వృధా ప్రయాసగానే మిగిలిపోతాయని ద‌త్తాత్రేయ ఎద్దేవా చేశారు. కేసీఆర్ క్రికెట్ ఆట మొదలవకముందే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రెండు వికెట్లు కోల్పోయారన్నారు. ఆ రాష్ట్ర నేత‌లు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ ఈ మేర‌కు ద‌త్తాత్రేయ ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా, ఆయనది పరిమిత పాత్రేన‌ని పేర్కొన్నారు. తన స్వంత అస్తిత్వం కోసం ప్రాకులాడుతున్నారు తప్ప ఆయ‌న కింగ్‌మేకర్ కానీ నిర్ణయాత్మక శక్తిగా ఉండే అవకాశమే లేదని ద‌త్తాత్రేయ అన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల నేత‌ల‌పై ద‌త్తాత్రేయ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English