గ్రీన్ కార్డ్ నిబంధ‌న‌ల్లో మార్పులు..మ‌నోళ్ల‌కు గుడ్ న్యూస్‌

గ్రీన్ కార్డ్ నిబంధ‌న‌ల్లో మార్పులు..మ‌నోళ్ల‌కు గుడ్ న్యూస్‌

నిబంధ‌న‌ల పేరుతో వ‌ణుకు పుట్టిస్తున్న అగ్ర‌రాజ్యం అమెరికాలో భారతీయులకు మళ్లీ మంచిరోజులు వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి క‌ల‌క‌లం రేకెత్తించే వీసా విధానాలు అవ‌లంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ తీరులో మార్పు రానుంద‌ని తెలుస్తోంది.  ఐటీ, ఐటీయేతర నిపుణులకు మేలు చేసే కీలక నిర్ణయం అమెరికా ప్రభుత్వం తీసుకోబోతోంది. కీల‌క‌మైన గ్రీన్ కార్డుల విష‌యంలో నిబంద‌న‌లు మార్పు చేసేందుకు ట్రంప్ స‌ర్కారు స‌న్న‌ద్ద‌మైంద‌ని తెలుస్తోంది.

వీసా విధానంలో భాగంగా, అమెరికాలో ఉంటున్న వారి కుటుంబీకులకు ప్రాధాన్యమిచ్చే బదులు, ప్రతిభ ఆధారంగా ఇమిగ్రేషన్ విధానాన్ని మార్చాలని ట్రంప్‌ భావిస్తున్నారు. దీనికి సంబంధించిన నూతన వలస విధానంపై త్వరలో వైట్ హౌజ్ ఓ ప్రకటన చేయబోతోంది. ఈ నూతన పాలసీ ప్రకారం, అమెరికా సాంకేతిక అవసరాలను తీర్చే వారికే గ్రీన్‌కార్డుల జారీలో ప్రాధాన్యం ఇస్తారు. అంటే ఎవరికి మెరిట్, టాలెంట్ ఉంటే వారికే గ్రీన్ కార్డు ద‌క్క‌నుంద‌ని అంటున్నారు.  ప్రస్తుతం అమెరికాలో ఉంటూ విదేశీయులను వివాహం చేసుకునే వారికి 60 శాతం, వేర్వేరు రంగాల్లో నిపుణులైన వారికి 12 శాతం గ్రీన్‌కార్డులు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన కొత్త విధానంలో 100 శాతం గ్రీన్‌ కార్డులు టాలెంట్ ఆధారంగానే ఇవ్వాలని నిర్ణయించారు.

అమెరికా ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులు జారీ చేస్తుంది. కాగా, నూత‌న నిబంధ‌న‌లు అమ‌లులోకి వ‌స్తే, హెచ్‌1బీ వీసా పొంది దశాబ్ద కాలంగా గ్రీన్‌కార్డుకోసం ఎదురు చూస్తున్న  వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం చేకూర‌నుంది. అదే జరిగితే భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లేవారు, అక్కడ హెచ్‌1బీ వీసాలపై ఉన్నవారికి యమ స్పీడుగా గ్రీన్‌కార్డులు వస్తాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English