క‌మల్‌ నాలుక కోసేయండి...మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

క‌మల్‌ నాలుక కోసేయండి...మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌ముఖ సినీన‌టుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ చేసిన వాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా..  అరవక్కురిచ్చిలో కమల్ హాసన్ మాట్లాడుతూ...స్వతంత్ర భారతదేశంలో తొలి హిందూ తీవ్రవాది గాడ్సే అని,మహాత్మగాంధీని హత్య చేసిన గాడ్సేతోనే దేశంలో ఉగ్రవాదం ప్రారంభమైందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్ల‌పై విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే ప‌లువురు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. మ‌రికొంద‌రు న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించారు. అయితే, అన్నాడీఎంకే నేత‌, తమిళనాడు మంత్రి కే.టీ.రాజేంద్ర మ‌రింత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తమిళనాడు మంత్రి కే.టీ.రాజేంద్ర బాలాజీ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. హిందువులపై వ్యాఖ్యలు చేసినందుకుగాను కమల్ నాలుక తెగిపడాల్సి ఉందని ఆయన అన్నారు. మైనార్టీల ఓట్లు పొందాలనే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని బాలాజీ అన్నారు. ఒక వ్యక్తి చేసిన పనికి మొత్తం హిందూ మ‌త‌స్తుల‌ను తప్పుప‌ట్టలేమని బాలాజీ అన్నారు. కమల్ పై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని,ఆయన పార్టీని బ్యాన్ చేయాలని రాజేంద్ర బాలాజీ అన్నారు.

మ‌రోవైపు మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌కు వ్యతిరేకంగా దాఖలైన క్రిమినల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కమల్‌హాసన్ తమిళనాడులో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో..ఆ ప్రాంతానికి సంబంధించిన ఫోరంలోనే దీనిపై సంప్రదించవచ్చునని పిటిషనర్ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయకు సూచించింది. అదే విధంగా పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ వేసిన పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు సూచనలు చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English