దీదీ డిసైడ్ అయ్యారు.. మోడీ పీఎం కాకూడ‌దంతే!

దీదీ డిసైడ్ అయ్యారు.. మోడీ పీఎం కాకూడ‌దంతే!

మూర్తీభ‌వించిన మొండిత‌నానికి నిలువెత్తు రూపంగా.. చూసేందుకు ప‌క్కింటి పెద్దావిడ‌లా ఉంటూ.. నూలు చీర‌తో నిరాడంబ‌రరంగా క‌నిపించే ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం దీదీ అలియాస్ మ‌మ‌తాబెన‌ర్జీ ఇగో భారీగా హ‌ర్ట్ అయ్యింది. బెంగాల్ మీద మోడీ చూపించే మోజును ఆమె తీవ్రంగా వ్య‌తిరేకిస్తారు. బీజేపీని రాష్ట్రంలో అడుగు పెట్ట‌కుండా ఉండేందుకు ఎంత‌వ‌ర‌కైనా రెఢీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ఆమె.. తాజాగా మోడీషాల మీద పోరును ప్ర‌క‌టించేశారు.
 
తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో బీజేపీనే ఏకైక పెద్ద పార్టీగా అవ‌త‌రిస్తుంద‌ని చెప్పారు. అయితే.. బీజేపీకి వ‌చ్చే సీట్లు 150కు మించ‌వ‌ని తేల్చిన ఆమె.. ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ప్ర‌త్యేకం ఇంట‌ర్వ్యూ ఇచ‌చారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. మ‌హారాష్ట్ర.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో బీజేపీకి సీట్లు బాగా త‌గ్గుతాయ‌న్న జోస్యం చెప్పారు.

మే 23 త‌ర్వాత కేంద్రంలో మోడీయేత‌ర ప్ర‌భుత్వం ఏర్పాటు ఖాయ‌మ‌న్నారు. మోడీని కాకుండా మ‌రెవ‌రైనా బీజేపీ నేత‌ను ప్ర‌ధాన‌మంత్రిచేస్తామ‌ని చెప్పి.. మ‌ద్ద‌తు కోరితే బీజేపీకి మీరు మ‌ద్ద‌తు ఇస్తారా? అంటే.. నో.. నెవ్వ‌ర్ అని తేల్చేశారు. బీజేపీ త‌మ‌ను ఎంతో అవ‌మానించింద‌ని.. ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చేశారు.

మోడీ ఎట్టి ప‌రిస్థితుల్లో ప్ర‌ధాని కాకూడ‌ద‌ని.. అందుకోసం అవ‌స‌ర‌మైతే రాహుల్ గాంధీని ప్ర‌ధాని కావ‌టానికైనా తృణ‌మూల్ కాంగ్రెస్ అంగీక‌రిస్తుంద‌న్న సంకేతాల్ని దీదీ పార్టీ నేత‌లు చెబుతున్నారు. రాహులే కాబోయే ప్ర‌ధాని అని స్టాలిన్ చెబుతున్న మాట‌ను తృణ‌మూల్ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదు. ఇప్పుడా పార్టీ ల‌క్ష్య‌మంతా మోడీని పీఎం కుర్చీ నుంచి కింద‌కు దించ‌ట‌మే. మ‌రి.. తాజా ల‌క్ష్యాన్ని ఆమె ఎంత‌వ‌ర‌కు చేరుకుంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English