వైసీపీ ఆఫీస్ షిఫ్ట్.. అసలు కారణం ఆ సర్వేనే అట

వైసీపీ ఆఫీస్ షిఫ్ట్.. అసలు కారణం ఆ సర్వేనే అట

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అదే రోజు పార్టీ నేతల సమక్షంలో కొత్త ఇంటి ఆవరణలోని వైసీపీ కేంద్ర కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. అక్కడ ఆ ఒక్క రోజు మాత్రమే జగన్ గడిపారు. ఇక ఆ తర్వాతి నుంచి పార్టీ వ్యవహారాలన్నీ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌ నుంచే చూసుకున్నారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల కోసం జగన్ వ్యూహాలు అమలు చేసింది కూడా ఇక్కడి నుంచే. దీంతో కొత్త ఇల్లు, కార్యాలయం ఉన్నా వైసీపీ అధినేత హైదరాబాద్‌లోనే ఎందుకు ఉంటున్నారనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ కలిగింది. దీనికి వైసీపీ శ్రేణులు పలు రకాల సమాధానాలు కూడా వినిపించాయి.

 అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తన కార్యకలాపాలను చేపట్టనుంది. ఈ మేరకు జగన్‌ నిర్ణయం కూడా తీసేసుకున్నారు. అందుకే హైదరాబాద్‌లో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఫర్నీచర్‌ను, ఇతర వస్తువులు, ఎలక్ట్రానిక్ సామాగ్రిని తాడేపల్లిలోని నూతన కార్యాలయానికి తరలించారు. పది రోజుల పాటు ఈ తరలింపు ప్రక్రియ కొనసాగింది. అంతేకాదు, తాడేపల్లిలో కూడా కార్యాలయానికి నూతన హంగులు ఏర్పాటు చేశారు. ఇకపై వైసీపీ కార్యకలాపాలన్నీ తాడేపల్లి కార్యాలయం నుంచే కొనసాగించాలని నిర్ణయించడంతో హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయ సిబ్బంది కూడా తాడేపల్లికి తరలుతున్నారు. ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు మిగిలిన పార్టీల నేతలు కూడా షాక్‌కు గురయ్యారు.

 జగన్ ఎందుకు ఉన్నట్లుండి కార్యాలయాన్ని మార్చుకున్నారు అని తమలో తామే ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. వైసీపీ అధినేత తీసుకున్న నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. బయటి సర్వే సంస్థలు కాకుండా.. జగన్ స్వయంగా చేయించుకున్న ఓ సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని తేలినట్లు సమాచారం. అందుకే ఫలితాలకు ముందే కొత్త కార్యాలయంలోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారని తెలిసింది. ఒకవేళ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ పని చేస్తే.. అధికారం వచ్చాక గానీ జగన్ ఏపీలోకి రాలేదు అని మిగిలిన పార్టీల నేతలు విమర్శలు చేసే అవకాశం ఉండడంతోనే ఇప్పుడు తాడేపల్లి షిఫ్ట్ అవుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో వైసీపీ నాయకుల్లో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English