ఆడియన్స్‌లో కూర్చుని సెలబ్రిటీ అయింది

ఆడియన్స్‌లో కూర్చుని సెలబ్రిటీ అయింది

సోషల్‌ మీడియా జమానా ఎవరైనా ఓవర్‌నైట్‌ సెలబ్రిటీ అయిపోవచ్చు. జస్ట్‌ సరయిన టైమ్‌లో సరయిన ప్లేస్‌లో వుండాలంతే. అదితి హుండియా అనే మోడల్‌ ఐపీఎల్‌ ఫైనల్‌లో ముంబయిని సపోర్ట్‌ చేస్తూ ఆడియన్స్‌లో కూర్చుంది. కెమెరా పదే పదే ఆమెని చూపించడంతో సోషల్‌ మీడియాలో ఆమె స్క్రీన్‌ షాట్లు పోస్ట్‌ అవడం మొదలైంది. మ్యాచ్‌ ముగిసే సరికి ఆమె హావభావాలు అన్నీ స్క్రీన్‌ షాట్లు తీసి అదితిని పాపులర్‌ చేసారు. దాంతో మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా కూడా ఆమె పట్ల ఆసక్తి చూపించి ఆమె ఎవరా అంటూ వాకబు చేసింది.

తెల్లవారే సరికి ఆమె గురించిన వార్తలు ప్రముఖ పత్రికలు అన్నిట్లోను వచ్చాయి. మోడలింగ్‌ రంగంలో చాలా కాలంగా వుంటోన్నా కానీ అదితికి ఇంతవరకు బ్రేక్‌ రాలేదు. క్రికెట్‌ మ్యాచ్‌ చూడ్డానికి నిండుగా బట్టలేసుకుని వెళితే ఇంత అటెన్షన్‌ రావడమేంటో ఆమెకి బోధ పడడం లేదు. కొద్ది గంటల్లోనే ఆమె సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌కి వేల కొద్దీ ఫాలోవర్స్‌ యాడ్‌ అయిపోయారు. ఇక ఈ వైరల్‌ బేబీ ఏదో ఒక సినిమాలో ఆఫర్‌ కొట్టడమే లేట్‌ అనుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English