నీతో పొత్తుకో నో..కేసీఆర్ మొహంపై చెప్పిన స్టాలిన్‌

నీతో పొత్తుకో నో..కేసీఆర్ మొహంపై చెప్పిన స్టాలిన్‌

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయాల పేరుతో దేశ‌వ్యాప్త టూర్ కొన‌సాగిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. డీఎంకే అధినేత స్టాలిన్ ఆయ‌న‌కు ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ అజెండాను కేసీఆర్ వివరించినప్పటికీ.. అందుకు స్టాలిన్ నుంచి సానుకూల స్పందన రాలేదని డీఎంకే వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ మీడియా ప్ర‌చారం చేసింది. అవ‌స‌ర‌మైతే, కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవాల‌ని కోరిన‌ట్లు స‌మాచారం.

చెన్నైలోని స్టాలిన్‌ నివాసంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయ‌న‌తో స‌మావేశం అయ్యారు. లోక్‌సభ ఎన్నికలు, రాజకీయ వ్యూహాలపై స్టాలిన్- కేసీఆర్ చర్చించారని స‌మాచారం. దేశంలోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోటీ చేశాయనీ  ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఫెడరల్ ఫ్రంట్ గా ఏర్పాటయ్యేందుకు డీఎంకే ముందుకు రావాలని కేసీఆర్ ఆహ్వానించినట్టుగా చెప్పారు. అయితే, ఈ సందర్భంగా డీఎంకే వైఖరిని స్టాలిన్.. కేసీఆర్ కు వివరించారని చెప్పారు. “కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం తీసుకురావడమే మా లక్ష్యం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా డీఎంకేనే ప్రపోజ్ చేసింది కాబట్టి  కాంగ్రెస్ నుంచి మేం విడిపోలేం. వీలుంటే మీరూ కాంగ్రెస్ తో జతకలవండి” అంటూ తన అభిప్రాయాన్ని స్టాలిన్ కేసీఆర్‌కు తేల్చిచెప్పిన‌ట్లు స‌మాచారం.

అయితే, ఫెడరల్ ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్‌.. ఇటీవలే వివిధ రాష్ట్రాల్లో త‌ను ప‌ర్య‌టించిన విష‌యాల‌ను వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ, కేసీఆర్ ఫ్రంట్ ప‌ట్ల డీఎంకే సానుకూలంగా స్పందించ‌లేద‌ని స‌మాచారం. కాగా, ఈ స‌మావేశం అనంత‌రం హైద‌రాబాద్ తిరుగు ప్ర‌యాణం అయి న‌గ‌రానికి చేరుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English