బాలయ్య ఓడిపోయినా.. ఆయన మాత్రం గెలుస్తారట

బాలయ్య ఓడిపోయినా.. ఆయన మాత్రం గెలుస్తారట

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునే హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని బాగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పార్టీ స్థాపించిన తర్వాత ఒక్క ఎన్నికల్లో కూడా ఓటమి అన్నదే ఎగురని టీడీపీకి.. ఈ సారి మాత్రం వ్యతిరేక ఫలితాలు రావొచ్చని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పలు సర్వేల ఫలితాలు కూడా దీనికి బలం చేకూర్చుతున్నాయి. ఈ పరిస్థితికి కారణం బాలయ్య నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండకపోవడమేనని అక్కడి ఓటర్లు అంటున్నారు. గతంలో ఆయన నియమించిన పీఏలు నియోజకవర్గంలో అభివృద్ధిని చేయకుండా సొంత ప్రయోజనాల కోసం పని చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది.

 హిందూపురం అసెంబ్లీ స్థానంలో ప్రతికూల ఫలితాలు వచ్చినా.. పార్లమెంట్ స్థానంలో మాత్రం విజయం టీడీపీదేనన్న టాక్ వినిపిస్తోంది. ఆ స్థానం నుంచి ఇప్పటికే రెండు సార్లు గెలిచి ఉన్న సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్ప.. మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ చేయబోతున్నారని అనంతపురం జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక హోదా విషయంలో ఆయన చేసిన పోరాటానికి తోడు, పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఎంపీ నిధులను వినియోగించడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. దీనికితోడు, ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో హిందూపురం, మడకశిర, పెనుకొండ, ధర్మవరం, రాఫ్తాడు, కదిరి, పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో టీడీపికి మంచి పట్టుంది.

 అంతేకాదు, హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఆరు చోట్ల టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కదిరిలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించిన చాంద్ బాషా టీడీపీలో చేరారు. అలాగే, గత ఎన్నికల్లో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలకు దక్కించుకుంది. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో 12 చోట్ల విజయం సాధించడంతో పాటు రెండు పార్లమెంట్లను కైవశం చేసుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో అక్కడి అభ్యర్థులు రెట్టించిన ఉత్సాహంతో పని చేసుకుపోయారు. ఈ క్రమంలోనే హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని మరోసారి ఆ పార్టీ దక్కించుకోబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గతంలో సంచలనానికి తెర లేపిన మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్‌ను బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English